twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఖిల్ సినిమాతో నటిగా మారిన సింగర్: పండుగ రోజు సర్‌ప్రైజ్ చేసిన చిత్ర యూనిట్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమై చాలా కాలమే అవుతోన్నా.. ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు అక్కినేని వారసుడు అఖిల్. హ్యాండ్సమ్ లుక్స్‌తో పాటు యాక్టింగ్ అద్భుతంగా చేయగల సత్తా ఉన్నా.. ఎందుకనో అతడు సక్సెస్ కాలేకపోతున్నాడు. 'అఖిల్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి సినిమాల్లో నటించాడు. కానీ, ఇవేమీ అఖిల్‌ను హిట్ ట్రాక్ ఎక్కించలేకపోయాయి. దీంతో అతడు ఎప్పటికప్పుడు రీలాంచ్ అవుతూనే ఉన్నాడు. తద్వారా వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.

    హాట్ ఫోజులతో రెచ్చిపోయిన సమంత: వామ్మో అలాంటి బట్టల్లో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!హాట్ ఫోజులతో రెచ్చిపోయిన సమంత: వామ్మో అలాంటి బట్టల్లో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

    ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. కానీ, కరోనా రెండు లాక్‌డౌన్ల కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. దీనికి తోడు కొన్ని రీషూట్ల వల్ల ఇది మరింత లేట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఫస్ట్ కాపీ రెడీ అయింది. దీనిపై చిత్ర యూనిట్ సంతృప్తిగా ఉంది. దీంతో దీన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

    Chinmayee Sripada Acting Debut with Akhil Most Eligible Bachelor

    'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖిల్‌తో పాటు వాళ్లు కూడా ఈ సినిమా హిట్ కావాలని ఆశిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆటోమేటిక్‌గా ఈ సినిమాపై అంచనాలు కూడా ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. అంతేకాదు, ఈ మూవీ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ధరలతో జరిగనట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ పోస్టర్ విడుదలైంది.

    రామ్ చరణ్ చేతికి విలువైన వాచ్: దాని ధర ఎంతో తెలిస్తే నిద్ర కూడా పట్టదు.. ఇది కూడా రికార్డే!రామ్ చరణ్ చేతికి విలువైన వాచ్: దాని ధర ఎంతో తెలిస్తే నిద్ర కూడా పట్టదు.. ఇది కూడా రికార్డే!

    సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా సత్తా చాటుతోన్న చిన్మయి శ్రీపాద 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ ద్వారా నటిగా పరిచయం కాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈరోజు ఆమె పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఆమె నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టబోతుందని ప్రకటించారు. ఇక, ఇందులో ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే.

    Chinmayee Sripada Acting Debut with Akhil Most Eligible Bachelor

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో అఖిల్ రొమాంటిక్ రోల్‌లో నటించాడు. అతడికి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే పాత్రను అదిరిపోయేలా క్రియేట్ చేశారు. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఎన్నో ఆశల నడుమ రూపొందిన ఈ చిత్రం ఆక్టోబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

    English summary
    Tollywood Young Hero Akhil Akkineni Did Most Eligible Bachelor Under Bommarillu Bhaskar. Chinmayee Sripada Acting Debute with this Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X