బూతు కామెంట్లు భరించలేకపోతున్నా.. ముదురుతున్న చిన్మయి, సందీప్ వివాదం

Recommended Video

Sandeep Reddy Vanga Gets Massive Support Over Chinmayi Issue || Filmibeat Telugu

ప్రేమికులను ఉద్దేశిస్తూ కబీర్ సింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్, వాటిపై చిన్మయి రియాక్ట్ అయిన తీరు సంచలనంగా మారింది. ఇద్దరి మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానలా పెద్ద దుమారాన్ని రేపుతోంది. చిన్మయి తీరుపై కొందరు స్పందిస్తూ నానా బూతులు తిడుతున్నారట. వీటితో ఆవేదన చెందిన చిన్మయి సదరు కామెంట్లను పోస్ట్ చేస్తూ వారిపై విరుచుకుపడింది. వివరాల్లోకి పోతే..

కబీర్ సింగ్ మూవీ.. సందీప్ వ్యాఖ్యలు

కబీర్ సింగ్ మూవీ.. సందీప్ వ్యాఖ్యలు

తెలుగులో 'అర్జున్ రెడ్డి' పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలన విజయం సాధించిన సినిమాకు రీమేక్ గా హిందీలో 'కబీర్ సింగ్' సినిమా రూపొందించారు సందీప్ రెడ్డి వంగా. టాలీవుడ్ లో ఎలాగైతే జోరు కొనసాగించిందో అదే జోరు బాలీవుడ్ లోనూ కొనసాగిస్తూ రికార్డు లెవెల్‌లో కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది కబీర్ సింగ్. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్.. ప్రేమికులన్నాక కొట్టుకోవడం, హత్తుకోవడం లాంటి స్వేచ్ఛ ఉండాల్సిందేనని వ్యాఖ్యానించాడు.

సందీప్ రెడ్డి పై చిన్మయి ఫైర్

అయితే సందీప్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు మహిళల్ని అవమానించేలా ఉన్నాయంటూ గాయని చిన్మయి ట్విటర్ ద్వారా పేర్కొంది. సందీప్ రెడ్డి మట్లాడిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన చిన్మయి.. 'ప్రేమలో ఉంటే ఒకరినొకరు కొట్టుకోవాలా.. నేను, నా భర్త ప్రేమలో ఉన్నాం.. నా భర్త నన్నెప్పుడూ కొట్టలేదు. ఒకరిని ఒకరు కొట్టుకుంటేనే ప్రేమని నిరూపించుకున్నట్లా?' అని ప్రశ్నించింది.

చిన్మయిని టార్గెట్ చేసిన నెటిజన్లు

చిన్మయిని టార్గెట్ చేసిన నెటిజన్లు

దీంతో సందీప్ రెడ్డి వంగా, చిన్మయి మధ్య వివాదం చెలరేగింది. కాకపోతే చిన్మయి చేసిన కామెంట్స్‌పై కొంతమంది నెటిజన్లు నెగిటివ్ ట్రోల్స్ చేస్తూ ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశిస్తూ బూతులు తిడుతున్నారట. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పేర్కొన్న చిన్మయి నెటిజన్లపై మండిపడింది. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఏదైనా మాట్లాడితే వాటిపై తమ అభిప్రాయం చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించింది.

మీరెలా మాట్లాడినా నాపై ప్రభావం ఉండదు

మీరెలా మాట్లాడినా నాపై ప్రభావం ఉండదు

నా ఒపీనియన్ నేను చెబితే.. నీ భర్త నీకు ఇంకా విడాకులు ఇవ్వలేదా? నీ భర్త ఇంకా చనిపోలేదా? నువ్ ఇంకా బతికే ఉన్నావా? అంటూ 'ల' 'దె' లతో మొదలయ్యే బూతు పదాలతో చెప్పడానికి వీలు లేని బూతులు తిడుతున్నారు. వాళ్లంతా ఏదో మూడో ప్రపంచ యుద్ధం వచ్చినంతగా ఫీల్ అయిపోతున్నారని పేర్కొంది చిన్మయి.

ఈ వివాదం ఇంకెంత దూరం పోతుందో!

ఈ వివాదం ఇంకెంత దూరం పోతుందో!

సందీప్ చేసిన వ్యాఖ్యలపై చిన్మయి ఫైర్ కావడం, నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం, మళ్లీ వాటిపై చిన్మయి రియాక్ట్ కావడం చూస్తుంటే ఈ ఇష్యుకి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. మరోవైపు కంగనా సోదరి రంగోలి లాంటి వారు సందీప్ కి అండగా నిలుస్తుండటంతో ఈ వివాదం ఇంకెంత దూరం పోతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X