మీరు బొట్టు, మెట్టెలు పెట్టుకోవాలిగా... డ్రెస్సింగ్‌ వ్యాఖ్యలపై శివాజీకి సింగర్ చిన్మయి కౌంటర్

దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. హీరోయిన్లు పద్ధతిగా చీర కట్టుకోవాలని.. గ్లామర్ పేరుతో అందాలను ప్రదర్శించొద్దని శివాజీ వ్యాఖ్యానించారు. దీనికి మహిళా నటులు, నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఇప్పటికే ఆయనపై ట్రోలింగ్ మొదలైంది. తాజాగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సతీమణి, స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద ఫైర్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..

దండోరాలో శివాజీ లీడ్ రోల్
లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన చిత్రం దండోరా. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫిని, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా, మార్క్ కే రాబిన్ మ్యూజిక్, క్రంతి ప్రియం ఆర్ట్ డైరెక్టర్‌గా, రేఖా బొగ్గార‌పు కాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ అవుతున్నది.

Chinmayi Sripada slams Hero Sivaji s remarks women s clothing at handoraa Pre Release event

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ వ్యాఖ్యలు
రిలీజ్ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలలో భాగంగా డిసెంబర్ 22న హైదరాబాద్‌లో దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో శివాజీ మాట్లాడుతూ.. మహిళా నటులు పద్దతిగా చీర కట్టుకోవాలని, మంచి వస్త్రధారణలోనే అందం ఉందని వ్యాఖ్యానించారు. సావిత్రి, సౌందర్య వంటి నటీమణులు చీరలో నిండుగా కనిపించేవారు. గ్లామర్ పేరుతో సామాన్లు ప్రదర్శించొద్దని.. ప్రపంచ వేదికలపై అందాల కిరిటీలను అందుకున్న వారంతా చీర కట్టుకున్నవాళ్లేనని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు, సినీ ప్రముఖులు శివాజీపై విరుచుకుపడతున్నారు.

శివాజీకి అనసూయ కౌంటర్
స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ అయితే నా బాడీ నా ఇష్టం అన్నట్లుగా రెండే ముక్కల్లో శివాజీ పేరెత్తకుండా కౌంటర్ ఇచ్చింది. తాజాగా ఈ వివాదంలోకి సింగర్ చిన్మయి శ్రీపాద వచ్చారు. మహిళా హక్కులు, వేధింపులు, సమానత్వంపై తొలి నుంచి యాక్టీవ్‌గా ఉంటున్న ఆమె.. శివాజీ వ్యాఖ్యాలపై ఘాటుగా స్పందించారు. ఆ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తెలుగు నటుడు శివాజీ గారు అసభ్య పదజాలంతో హీరోయిన్లకు అక్కర్లేని సలహా ఇచ్చాడు. ఆయన వాడిన పదాలను ఎక్కువగా పోకిరీలే మాట్లాడతారు అని చిన్మయి ఎద్దేవా చేశారు.

మీరు బొట్టు, మెట్టలు పెట్టుకోవాలిగా
ఓ మంచి సినిమాలో విలన్ నటించి.. పోకిరీలకు హీరోగా మారిపోయాడు. బహిరంగ ప్రదేశాల్లో శివాజీ లాంటి నటుడు దరిద్రపు ముండ అనే పదాలు వాడుతున్నాడు. ఆయన మాత్రం చక్కగా జీన్స్, హూడీ ధరించి ఈవెంట్‌కు వచ్చాడు. మరి శివాజీ చెబుతున్న దానిని బట్టి భారతీయ సాంప్రదాయం ప్రకారం ధోతీ కట్టుకుని రావాలి కదా? శివాజీకి పెళ్లయి ఉంటే కంకణం ధరించి బొట్టు, మెట్టెలు కూడా పెట్టుకోవాలి కదా. అసలు మహిళలను వీరంతా ఇలా చూస్తున్నారంటే నమ్మలేకపోతున్నా. ఈ వ్యాఖ్యలకు గాను శివాజీ క్షమాపణలు చెప్పాలని చిన్మయి ఘాటుగా పోస్ట్ పెట్టారు.

More from Filmibeat

Read more about: chinmayi sripada sivaji Dhandoraa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X