ఇలాంటి మెసేజ్‌లు పెడతారా అంటూ చిన్మయి ఫైర్.. స్క్రీన్ షాట్ తీసి మరీ షేర్ చేసి ఇలా కూడా బుక్కయింది

Recommended Video

Chinmayi Fires On Her Followers In Twitter || Filmibeat Telugu

సెలిబ్రిటీలకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ఒక్కటే సరిపోదు. ఎలాంటి మెసీజీలు పెట్టాలి, ఎలాంటి ఫోటోలు షేర్ చేయాలి అనే దానిపై సరైన అవగాహన ఉంది తీరాలి. లేదంటే నెటిజన్ల నుంచి చీవాట్లు తప్పవు. పాపం ప్రస్తుతం చిన్మయి పరిస్థితి అదే. ముక్కుసూటిగా మాట్లాడేస్తూ, ఎలాంటి కటింగ్స్ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా సోషల్ మీడియా పోస్టులు పెట్టే చిన్మయిపై ట్రోలింగ్స్ పోటెత్తుతున్నాయి. వివరాల్లోకి పోతే..

ఇటీవలే మన్మథుడు 2 టీజర్ విషయమై

ఇటీవలే మన్మథుడు 2 టీజర్ విషయమై

ఇప్పటి సినిమాల్లో హీరో హీరోయిన్ ల వయసు తేడా పై అప్పట్లో సెన్సేషనల్ కామెంట్ చేసిన.. చిన్మయిని ఇటీవలే గట్టిగా తగులుకున్నారు ఆన్‌లైన్ ట్రోలర్స్. చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న మన్మథుడు 2 సినిమాలో సీనియర్ హీరో నాగార్జునతో యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్ సంగతేంటంటూ? ఆమెపై విరుచుకు పడ్డారు నెటిజన్లు. దీంతో షాక్ తిన్న చిన్మయి భర్త దీనికి వివరణ ఇచ్చాడు.

అది మరవక ముందే.. అసభ్యకర పదజాలంతో సందేశాలు

అది మరవక ముందే.. అసభ్యకర పదజాలంతో సందేశాలు

ఈ షాక్ నుంచి ఇంకా కోలుకోక ముందే మరోసారి చిన్మయిపై విరుచుకు పడ్డారు ట్రోలర్స్. మీ అభిమానిని అని పేర్కొంటూ ఓ వ్యక్తి ఆమెకు అసభ్యకర పదజాలంతో సందేశాలు పోస్ట్ చేశాడు. పైగా ఇలా మాట్లాడితేనే నువ్వు రిప్లై ఇస్తావని ఈ వల్గర్ మెసేజ్ చేస్తున్నా అని పేర్కొన్నాడు సదరు వ్యక్తి. దీంతో చిన్మయికి చిర్రెత్తే కోపం వచ్చింది.

స్క్రీన్ షాట్ తీసి ఫైర్ అవుతూ

స్క్రీన్ షాట్ తీసి ఫైర్ అవుతూ

ఆ వ్యక్తి పోస్ట్ చేసిన అసభ్య పదజాల సందేశాల్ని చిన్మయి స్క్రీన్‌షాట్‌ తీసి మరీ తన ట్విట్టర్ ద్వారా షేర్‌ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోతే అభిమాని ఇలాంటి మెసేజ్‌లు చేస్తాడా? అని ఘాటుగా బదులిచ్చింది. అయితే ఈ ఉదంతం ఇంతటితో ఆగలేదు. వెంటనే మరో నెటిజన్ ఆమెను తగులుకొని నానా రచ్చ చేశాడు.

దానికి సమయం ఉంది కానీ.. దీనికి లేదా?

దానికి సమయం ఉంది కానీ.. దీనికి లేదా?

''ఓ ఫ్యాన్‌కు చిరాకు వచ్చే వరకూ ఎదురుచూసి, తర్వాత ఆ మెసేజ్‌లను షేర్‌ చేసేందుకు మీకు సమయం ఉంది. కానీ హాయ్‌.. థాంక్యూ అని రిప్లై ఇవ్వడానికి సమయం లేదా?'' అని ఆమెను ప్రశ్నించాడు ఆ నెటిజన్. ఇక చేసేది లేక దీనిపై స్పందించిన చిన్మయి.. 'నాకు రోజుకు వెయ్యి మెసేజ్‌లు వస్తాయి. ఇక్కడ కూర్చుని ప్రతి ఒక్కరికీ రిప్లై ఇవ్వడం నా పనికాదు' అని పేర్కొంది.

సోషల్ మీడియా కష్టాలు.. హద్దు దాటారా ఇక అంతే!

సోషల్ మీడియా కష్టాలు.. హద్దు దాటారా ఇక అంతే!

సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని ఎలా పడితే అలా బిహేవ్ చేయడం సరికాదని ఇప్పటికే పలుసార్లు రుజువైంది. కొన్ని సందర్భాల్లో వ్యక్త పరిచే భావాలు సరిగ్గా ఉన్నప్పటికీ ఆ మెసేజ్‌ని నెటిజన్లు మరో రకంగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే సెలెబ్రిటీలు జాగ్రత్తగా ఉండండి. నెటిజన్లు మీరు కూడా హద్దు దాటితే కష్టాలు తప్పవు సుమా!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X