twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రొమాన్స్‌ విషయమై నోరు విప్పిన చిన్మయి.. అడ్డంగా బుక్కయింది.. చేసేది లేక!

    |

    Recommended Video

    Chinmayi Trolled By Netijans On Manamadhudu 2 Movie Issue || Filmibeat Telugu

    సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి ప్రూవ్ అయింది. నెటిజన్స్ తమను ట్రోలింగ్ చేస్తున్నారని వారిపై అబాండం మోపడం కాదు.. ముందు తాము పెట్టే ట్వీట్స్ గురించి కాస్త వెనకా ముందూ ఆలోచించి పెట్టాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. నెటిజన్స్ దగ్గర ప్రతీ రికార్డ్ భద్రంగా ఉంటుంది. అవసరమైనప్పుడు దాన్ని బయటకు తీసి చెడుగుడు ఆడేస్తారు. తాజాగా గాయని చిన్మయి విషయంలో అదే జరుగుతోంది. ఆమెపై మండిపడుతూ ఓ రేంజ్ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. వివరాల్లోకి పోతే..

    సమంత ప్రియనేస్తం చిన్మయి.. ఫుల్లుగా ఫేమస్

    సమంత ప్రియనేస్తం చిన్మయి.. ఫుల్లుగా ఫేమస్

    టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టుగా చిన్మయి అందరికీ సుపరిచితమే. పైగా ఆమె సమంతకు క్లోజ్ ఫ్రెండ్ కావడంతో మంచి గుర్తింపు వచ్చింది. మరోవైపు కొద్దికాలంగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ మహిళలపై జరుగుతున్న సెక్సువల్ హరాస్మెంట్ విషయమై ఘాటుగా స్పందించడం కారణంగా చిన్మయి ఫుల్లుగా ఫేమస్ అయింది.

    పనిలో పనిగా ఆ కామెంట్ పెట్టేసింది

    పనిలో పనిగా ఆ కామెంట్ పెట్టేసింది

    మహిళలపై లైంగిక వేధింపుల విషయాల్లో స్పందిస్తున్న చిన్మయి.. పనిలో పనిగా ఇప్పటి సినిమాల్లో హీరో హీరోయిన్ ల వయసు తేడా పై ఓ సెన్సేషనల్ కామెంట్ చేసింది. వయసు పైబడిన హీరోలు యంగ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తుండటం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సాధారణ పరిణామంగా మారిందని పేర్కొంటూ, ఈ కల్చర్ ఇంకా కంటిన్యూ అవుతోందని.. ఎప్పుడు ఆగుతుందో! అని ఓ సెటైరికల్ కామెంట్ చేసింది. ఆ సమయంలో చిన్మయి చేసిన ఈ కామెంట్ పై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

    భర్త రాహుల్ రవీంద్రనే ఆ పని చేసేశాడు

    భర్త రాహుల్ రవీంద్రనే ఆ పని చేసేశాడు

    అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న మన్మథుడు 2 సినిమాలో సీనియర్ హీరో నాగార్జునతో యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెగ రొమాన్స్ చేసేసింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ నాగ్, రకుల్ రొమాన్స్ ఏ రేంజ్ లో ఉండనుందో చెప్పేసింది. పైగా ఈ సినిమాకు చిన్మయి తనవంతు ప్రమోషన్ చేస్తోంది.

    ఇంకేముంది అడ్డంగా బుక్ అయిపోయింది

    ఇంకేముంది అడ్డంగా బుక్ అయిపోయింది

    దీంతో నెటిజన్లు చిన్మయిని గట్టిగా తగులుకున్నారు. ఆ రోజు హీరో హీరోయిన్ల వయసుపై కామెంట్ చేశావుగా! మరి ఈ రోజు నీ భర్తనే ఇలాంటి కాంబినేషన్ ఎంకరేజ్ చేస్తున్నాడు.. పైగా నువ్ సపోర్ట్ చేస్తున్నావు. ఏంటి సంగతి? అని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఇందులో కూతురి వయసున్న భామలకు ముద్దులు పెట్టడం, రొమాన్స్ చేయడం లాంటివి ఉన్నాయి. మరి దీన్నేమంటారు? అంటూ నిలదీస్తున్నారు. పాపం దీనికి సమాధానం చెప్పలేక, భర్త సినిమాపై నెగెటివ్ గా మాట్లాడలేక అలా అడ్డంగా బుక్కైపోయింది చిన్మయి.

    మన్మథుడు 2 మూవీ

    మన్మథుడు 2 మూవీ

    రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన్మథుడు 2 సినిమాలో నాగార్జున హీరోగా నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సమంత, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాలా రోజుల తర్వాత నాగార్జున లోని మన్మథుడిని చూడాలని ఈ సినిమాపై ప్రేక్షకులు ఫుల్లుగా ఆశలు పెట్టుకున్నారు.

    English summary
    Senior Hero Nagarjuna decides to release his Manmadhudu 2 in july. This movie recently completed Porchugal schedule and come back to hyderabad. In this movie young heroine Rakul Preet Singh with Nagarjuna is some what controversial on Chinmayi point of comment
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X