చిరంజీవి సంచలన నిర్ణయం.. 25 లక్షల విరాళం!
తెలుగు సినిమా పురోగతికి, ప్రతిష్టకు దిశానిర్దేశం చేసిన స్వర్గీయ దాసరి నారాయణరావును ఘనంగా స్మరించుకొన్నారు. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు ఆయనకు నిజమైన నివాళిని అర్పించారు. హైదరాబాద్‌లో దాసరి నారాయణరావు పుట్టిన రోజు మే 4న డైరెక్టర్స్ డేగా పాటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, డైరెక్టర్లతోపాటు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన సంచలన నిర్ణయం తీసుకొన్నారు.

శనివారం సాయంత్రం జరిగిన డైరెక్టర్స్ డే కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి హాజరుకావడంతో భారీగా వేడుకను జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దాసరి నారాయణ సేవలను మెగాస్టార్ గుర్తు చేసుకొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని మరోసారి వేదికపైన వెల్లడించారు. ఆయన లేకపోవడం సినిమా పరిశ్రమకు తీరని లోటు అని చిరంజీవి అన్నారు.
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన దర్శకుల సంఘానికి తన వంతు సహాయంగా 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. చిరంజీవి ఆర్థిక సహాయంపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











