For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Chiru154: ఆ డైరెక్టర్‌ కోసం చిరంజీవి ముందడుగు.. టార్గెట్ పెట్టుకుని మరీ దిగాడట

  |

  ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చిన ఆయన.. తనలోని అద్భుతమైన టాలెంట్‌తో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగుతూనే ఉన్నారు. కొన్నేళ్ల క్రితం రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ తీసుకున్న చిరంజీవి.. 'ఖైదీ నెంబర్ 150' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. దీని తర్వాత 'సైరా: నరసింహా రెడ్డి' మూవీ కూడా చేశారు. ఇక, ప్రస్తుతం ఆయన రామ్ చరణ్‌తో కలిసి 'ఆచార్య' అనే మూవీ చేస్తున్నారు.

  బట్టలు లేకుండా ఇలియానా ఫోజులు: అదొక్కటే అడ్డుగా పెట్టి.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!

  'ఆచార్య' షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్‌ను 'గాడ్ ఫాదర్' టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. దీని అనంతరం మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో బంపర్ హిట్ అయిన వేదాళం చిత్రాన్ని 'భోళా శంకర్'గా రీమేక్ చేస్తున్నారు. ఇవన్నీ పూర్తైన తర్వాత చిరంజీవి.. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరొందిన కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతోనూ సినిమా చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు.

  Chiranjeevi 30 Days Call Sheet for K. S. Ravindra Movie

  బాబీ సినిమా అంటే ఎన్నో హంగులతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పటి వరకూ అతడు చేసిన ప్రతి సినిమా అలాగే ఉంది. ఇప్పుడు చిరంజీవితో చేసే సినిమా కూడా అదే మాదిరిగా ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను 'భోళా శంకర్' కంటే ముందే పూర్తి చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. అందుకే దీన్ని తన 154వ సినిమా అని ప్రకటించారు. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ గురువారమే ప్రారంభం అయింది. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించాడు.

  తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఏకంగా 30 రోజులు కాల్షీట్స్ ఇచ్చారట. అంటే గురువారం నుంచి ఏకధాటిగా చిత్రీకరణ జరగబోతుందని తెలుస్తోంది. ఈ మొత్తంలో చిరంజీవికి సంబంధించిన సన్నివేశాలనే చిత్రీకరించబోతున్నాడట దర్శకుడు కేఎస్ రవీంద్ర. అందుకు అనుగుణంగానే అందరి డేట్స్‌ను అడ్జస్ట్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ షెడ్యూల్ పూర్తైన తర్వాత మెగాస్టార్.. 'గాడ్ ఫాదర్' మూవీ షూటింగ్‌కు షిఫ్ట్ అవుతారని తెలుస్తోంది.

  ప్రియమణి బాడీపై బన్నీ షాకింగ్ కామెంట్స్: బుగ్గ పట్టుకుని నాటీగా.. ఎప్పటికైనా అవకాశం వస్తుందంటూ!

  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ మూవీ ఓ స్టార్ హీరోకు, అభిమానికి మధ్య జరిగే కథతో రూపొందుతుందట. సినిమా హీరో, అభిమాని మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా రూపొందనుంది. చిరు హీరో పాత్ర చేస్తుండగా.. అభిమాని రోల్ కోసం మరో యంగ్ హీరోను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఆ పాత్ర కోసం హీరోలను అన్వేషిస్తున్నారట. ఇక, ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే.

  English summary
  Megastar Chiranjeevi Now Doing a Movie Under K. S. Ravindra Direction. Chiranjeevi Gave 30 Days Call Sheet for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X