ఆ ఇద్దరు గ్రేట్.. పైసా, ప్రతిఫలం ఆశించకుండా నటించారు.. చిరంజీవి
Recommended Video
మెగాస్టార్ నటించిన సైరా చిత్రం దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించే దిశగా పరుగులు పెడుతున్నది. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరిపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. టెక్నికల్ విభాగం పనితీరు హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా ఉండటంతో ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతున్నారు. ఈ సందర్భంగా సైరా యూనిట్ విజయోత్సవ వేడుకల్లో మునిగిపోయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్మాత రాంచరణ్ థాంక్యూ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..

అమితాబ్ బచ్చన్ కావాలని
సైరా సినిమాలో నా గురువు గోసాని వెంకన్న పాత్ర కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి అమితాబ్ బచ్చన్ కావాలన్నాడు. ఆయన నటిస్తాడా? అవసరమా అని అంటే.. మీ గురువుగా కాళ్లకు మొక్కే నటుడు ఇంకా కనిపించడం లేదు. అందుకే అమితాబ్ ఆ పాత్రకు కావాలి అని చెప్పారు అని చిరంజీవి వెల్లడించారు.

నా గురించి వర్రీ కావొద్దని
దర్శకుడు సురేందర్ రెడ్డి సూచన మేరకు ఫోన్ చేయగా అమితాబ్ సానుకూలంగా స్పందించారు. నేను ఆ పాత్రను చేయగలనా అంటే అవును. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పగానే బిగ్‌బీ ఒకే అన్నారు. సినిమా సభ్యులను పం అంతేకాకుండా షూటింగ్ రాకపోకలకు ఎలాంటి శ్రమ తీసుకోవద్దు. నా అంతట నేను వచ్చి వెళ్లిపోతానని చెప్పారు.

సొంత ఖర్చులతో వచ్చి
అంతేకాకుండా సైరా సినిమా కోసం ప్రైవేట్ జెట్‌లో తన 15 మంది సిబ్బందితో సహా వచ్చారు. వారి ఖర్చు కూడా ఆయనే భరించారు. నా ఫ్రెండ్ కోసం చేస్తున్నాను. నేను మీకు భారం కావొద్దని చెప్పారు. కేవలం ఆయన నటించి.. ఎలాంటివి ఆశించకుండా వెళ్లిపోయారు. ఓ స్నేహితుడి కోసం ఇలా చేయవచ్చా అని ఆయన నుంచి నేర్చుకొన్నాను. అమితాబ్‌కు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని చిరంజీవి చెప్పారు.

ప్రతిఫలం ఆశించుకుండా అనుష్క
సైరా ప్రమోషన్‌లో అనుష్క గురించి చెప్పకుండా సీక్రెట్‌గా ఉంచాం. ఈ సందర్భంగా అనుష్క గురించి చెప్పాలి. అమితాబ్ మాదిరిగానే అనుష్క కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛంంగా వచ్చి ఈ సినిమా కోసం పనిచేశారు. రాంచరణ్ అడిగారని.. చిరంజీవి సినిమాలో పనిచేయాలని ఆమె ముందుకు వచ్చారు. అంతేకాకుండా అమెరికా నుంచి ఇక్కడి వచ్చి షూట్ చేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా అనుష్కకు ధన్యవాదాలు తెలియజేయాలి అని చిరంజీవి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











