నా ఒత్తిడిని దూరం చేసేది అదే.. వారే.. చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రంగా సైరాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనాలకు వేదికగా నిలిచారు. ఈ సినిమాకు ముందు డైలీ హంట్, తెలుగు వన్ ఇండియా, తెలుగు ఫిల్మీబీట్‌కు చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనకు నచ్చే విషయాలను పంచుకొన్నారు.
నా కెరీర్‌లో ఎన్నో దేశాలు తిరిగాను. కానీ ప్రపంచంలో నాకు బాగా నచ్చిన ప్రదేశం స్విట్జర్లాండ్. కానీ ఇటీవల జపాన్ దేశం నాకు బాగా నచ్చింది. జపనీస్ ఫుడ్, యాంబినేషన్.. అక్కడి ప్రజల ఆదరణ నాకు బాగా నచ్చుతుంది. ఇటీవలే పర్యటించాను. స్విట్జర్లాండ్ కంటే నాకు బాగా నచ్చింది అని చిరంజీవి అన్నారు.

నా జీవితంలో నాకు సంతృప్తిని ఇచ్చే మూడు అంశాలలో ఒకటి సినిమా షూటింగ్, సెట్‌లో ఉండటం. సెట్‌లో ఉంటే నా ఎనర్జీ వేరేగా ఉంటుంది. ఇక నా ఫ్యామిలీతో క్రూయిజ్‌లో విహార యాత్రకు వెళ్లడం. అలా నా కుటుంబంతో వెళితే మాటల్లో చెప్పలేనంత ఉత్సాహం లభిస్తుంది. ఇక నా మనువరాళ్లతో ఆడుకోవడం అంటే ఇంకా ఇష్టం. నాలోని ఒత్తిడిని దూరం చేస్తారు. అని చిరంజీవి పేర్కొన్నారు.
ఇక సైరా విషయానికి వస్తే.. సినిమా రిలీజ్ రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటేసింది. వర్కింగ్ డే రోజను కూడా నిలకడగా వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. అలాగే వారాంతానికి ఈ సినిమా డిస్టిబ్యూటర్లను లాభాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











