Mark Shankar Pawanovich : ఇంకా కోలుకోవాలి .. మార్క్ శంకర్ హెల్త్ కండీషన్‌పై చిరంజీవి సంచలన పోస్ట్
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకం రేగింది. కుమారుడి క్షేమ సమాచారం గురించి ఆందోళన చెందిన పవన్ కళ్యాణ్.. హుటాహుటిన సింగపూర్ బయల్దేరి వెళ్లారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు. తాజాగా మార్క్ శంకర్ పెదనాన్న, మెగాస్టార్ చిరంజీవి అతని ఆరోగ్యంపై సంచలన పోస్ట్ చేశారు.
మార్క్ శంకర్ ఉన్న భవనంలో అగ్నిప్రమాదం జరిగిందని చిన్నారికి స్వల్పంగా గాయాలైనట్లుగా అరకు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు సమాచారం అందింది. ఈ వార్త మీడియా ద్వారా తెలుగునాట కలకలం రేపింది. అయితే అత్యవసర కార్యక్రమాలు, ముందుగా షెడ్యూల్ చేసిన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అనంతరం విశాఖ పర్యటనను రద్దు చేసుకుని మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు.

తన కుమారుడికి ప్రమాదం జరిగిన విషయం తెలిసి షాక్ అయ్యానని హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ తెలిపారు. తన పెద్ద కుమారుడు అకీరా నందన్ పుట్టినరోజు నాడే చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు ప్రమాదం జరగడంపై ఉప ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తన సోదరుడు చిరంజీవి, వదిన సురేఖతో కలిసి పవన్ కళ్యాణ్ సింగపూర్ చేరుకున్నారు.
మార్క్ శంకర్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, హీరో జూనియర్ ఎన్టీఆర్ తదితరులు విచారం వ్యక్తం చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా వారు ఆకాంక్షించారు. అటు పవన్ కళ్యాణ్ కుమారుడి ఆరోగ్యంపై సింగపూర్ ఆసుపత్రి వర్గాలు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి.
తాజాగా మార్క్ శంకర్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కీలక ప్రకటన చేశారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడని.. అయితే ఇంకా కోలుకోవాలని చిరు తెలిపారు. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడని చిరంజీవి ట్వీట్ చేశారు.
రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసిబిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడని మెగాస్టార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి మా బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారని చిరంజీవి అన్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మెగాస్టార్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే తన సోదరుడు పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోలను చిరంజీవి ఆ ట్వీట్‌లో పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











