ఎంతో గర్వంగా ఉంది.. సుష్మితపై చిరు కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు రంగస్థలం, ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్‌గా పని చేసింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిర్మాతల్లో ఒకరిగా సుష్మిత కూడా స్థానాన్ని సంపాదించుకుంది. ఓటీటీ ప్రపంచంలో ఓ సినిమాను సుష్మిత నిర్మించేసింది. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ వంటి పెద్ద పెద్ద వాళ్లతో షూట్ అవుట్ ఎట్ ఆలేర్ సినిమా నిర్మించింది.
ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగా ఈ మూవీని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా జీ5 యాప్‌లో రిలీజ్ అయింది. రామ్ చరణ్‌తో స్పెషల్ ప్రమోషన్ చేయించిన సుష్మిత సినిమాపై బాగానే హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. మొత్తానికి సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో అందరూ ఆనందంగా ఉన్నారు. సినిమా బాగా క్లిక్ అవ్వడంతో చిరంజీవి కూడా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో సుష్మిత విష్ణు కలిసి నిర్మించిన షూట్ అవుట్ ఎట్ ఆలేర్ సినిమాకు మంచి ప్రశంసలు లభించడం నాకెంతో గర్వంగా ఉంది. ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు చాలెంజింగ్ స్టోరీతో ఎంట్రీ ఇవ్వాలనుకోవడం నిజంగా ధైర్యమే.. సుష్మిత హార్డ్ వర్క్, ప్యాషన్‌కు కచ్చితంగా గుర్తింపు లభిస్తుంది.. నీకు మరింత శక్తి చేకూరాలి.. టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ అంటూ చిరు పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











