వేటాడుతోన్న ‘ఆచార్య’.. అదిరిపోయిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. మోషన్ పోస్టర్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అంటే మెగా అభిమానులకు పండుగే. అలాంటిది వినాయకుడి చతుర్థి నాడు తమ నాయకుడి పుట్టిన రోజు రావడం యాదృచ్చికం. ఇలా రెండు పండుగలు ఒకేసారి రావడం ఒకెత్తు అయితే.. మరో పండుగ కూడా వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి కొరటాల అప్ డేట్ వచ్చేసింది.ఎన్నో రోజుల నుంచి ఊరిస్తోన్న చిరు 152 ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
Recommended Video

మెగా విషెస్..
మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. యంగ్ హీరోలు, దర్శక నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, హీరోయిన్లు ప్రతీ ఒక్కరూ మెగాస్టార్‌కు ట్వీట్లతో ప్రేమను చాటుతున్నారు.

ఎమోషనల్ అయిన ఫ్యామిలీ మెంబర్స్..
చిరంజీవి బర్త్ డే సందర్భంగా మెగా, అల్లు ఫ్యామిలీలు సోషల్ మీడియాలో ఎమోషనల్అయ్యాయి. అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, శ్రీజ, సుష్మిత ఇలా ప్రతీ ఒక్కరూ చిరుకు విషెస్ చెబుతూ అమితమైన ప్రేమను కురిపించారు.

ఆచార్య అప్డేట్..
చిరంజీవి కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదలుపెట్టి ఏడాది గడుస్తోన్నా కూడా చిన్నఅప్డేట్ కూడా ఇవ్వలేదు. అందుకే ఈ చిత్రం గురించి, అప్డేట్ గురించి మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూడసాగారు. ఇక చిరు బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేయబోతోన్నారని ప్రకటించడంతోనే ఎంతో సంతోషించారు. ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను చూసి గాల్లో తేలిపోతున్నారు.

అదిరిన ఫస్ట్ లుక్..
చిరు 152 ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఓ రేంజ్‌లో ఉంది. కత్తి పట్టుకుని వేటాడుతున్న పులిలా చిరు ఓ రేంజ్‌లో ఉన్నాడు. ఇక దర్మస్థలి అంటూ, ఊరి ప్రజలు, ఇలా చూపిస్తూ సినిమా కాన్సెప్ట్‌పై ఓ హింట్ ఇచ్చారు. ఇక మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్‌లో ఉంది. మళ్లీ మళ్లీ చూడాలినిపించేంతలా మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











