Chiranjeevi: 25 కోట్ల సినిమా సెట్.. కాలిపోవడానికి కారణం ఆ చిన్న పొరపాటే..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన హీరోగా రామ్ చరణ్ సపోర్టింగ్ రోల్ లో నటించిన ఆచార్య మూవీ గత ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ అయ్యింది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ డిజాస్టర్ అయినా కూడా ఓ వర్గం ఫ్యాన్స్ ను మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా కోసం ధర్మస్థలి అనే ఖరీదైన సెట్ ను నిర్మించిన విషయం తెలిసిందే. ఆయితే ఆ సెట్ నిర్మాణానికి నిప్పు అంటుకొని అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక చిన్న పొరపాటు కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ధర్మస్థలి సెట్
ఆచార్య సినిమా కోసం ప్రత్యేకంగా ధర్మస్థలి అనే ఒక ప్రాంతాన్ని సృష్టించారు. ఇక ధర్మస్థలి అమ్మవారి ఆలయాన్ని కూడా ఏకంగా 25 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కోకాపేటలో ఈ సెట్ ని వేశారు. సైరా నరసింహారెడ్డి కోసం ఈ ప్రాంతంలోనే కొన్ని ప్రత్యేకమైన సెట్స్ వేశారు. అలాగే ఆచార్య సినిమాలోని అమ్మవారి ఆలయం సెట్ కూడా ఈ ప్రాంతంలో వేశారు.

వేరే సినిమాల కోసం..
అయితే దీనిని వేరే సినిమాల కోసం కూడా ఉపయోగించవచ్చు అనే ఉద్దేశ్యంతో అలాగే వదిలేసారు. ఇక ఈ ఆలయాన్ని చూసేందుకు సందర్శకులకి కూడా అనుమతి ఇస్తున్నారు. అయితే ఈ సెట్ ని చూడటానికి ప్రతీ రోజు చాలామంది వస్తుంటారు. ముఖ్యంగా వీకెండ్స్ లో జనాల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇండస్ట్రీలో మరికొందరి హీరోల సినిమాల కోసం ఈ సెట్ ను బాగానే వాడుతున్నారు.

ఒక్కసారిగా మంటలు
ఇక మంగళవారం రోజు మాత్రం హఠాత్తుగా సెట్ కి నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి వట్టినాగులపల్లి ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని సెట్ లో మంటలని అదుపు చేశారు. అయితే అప్పటికే ఆ సెట్ మొత్తం పూర్తిగా దగ్ధం అయినట్లు తెలుస్తుంది. ఇక మంటలను ఆర్పేందుకు స్థానికులు కూడా ఫైర్ సిబ్బందికి సహకరించారు.

సెట్ కోసం 25 కోట్లు
ఇక ఆచార్య సినిమా ఏకంగా 140 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా కేవలం ఈ ధర్మస్థలి సెట్ కోసమే 25 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అలాగే ఆలయం చుట్టూ ఓ చిన్న సైజు గ్రామాన్ని కూడా నిర్మించారు. అయితే సినిఅమ డిజాస్టర్ అయ్యి పెట్టిన పెట్టుబడి చాలా వరకు పోయింది. ఆ నష్టాల వలన దర్శకుడు కొరటాల శివ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

అసలు కారణం..?
ఇక ఈ సెట్ లో అగ్నిప్రమాదం జరగడానికి కారణం రోజు సందర్శనార్థం వస్తున్న వారిలో ఓ వ్యక్తి సిగరెట్ తాగి దానిని పూర్తిగా ఆర్పకుండా అక్కడే పడేసాడని తెలుస్తోంది. ఇక ఆ సిగరెట్ నుంచి నిప్పు రాజుకొని ఆ సెట్ మొత్తం దగ్ధం అయినట్లు చెబుతున్నారు.
సెట్ ని వేరే సినిమాల కోసం అద్దెకి ఇద్దామని అనుకుంటే అది కూడా 25 రూపాయిల సిగరెట్ కారణంగా పూర్తిగా కాలిపోయి బూడిదైపోయింది అని తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనే విషయాలపై పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు.


Click it and Unblock the Notifications











