Balakrishna Chiranjeevi: చిరు, బాలయ్య కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. ఈ మధ్య మంచి జోష్ లో ఉన్నారు. కుర్ర హీరోలకు పోటీనిస్తూ.. వరుస సినిమాలతో దూసుకువెళ్తున్నారు. సంక్రాంతికి వీరిద్దరూ వచ్చి.. వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలతో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్లను అందుకున్నారు. అయితే వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించారనే విషయం మీకు తెలుసా. అవును. ఈ పెద్ద హీరోలు కలిసి ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా ఏంటి .. ఎప్పుడు వచ్చిందనే వివరాల్లోకి వెళితే...
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి...: చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి... మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 150కి పైగా సినిమాల్లో నటించి... కోట్ల అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి ఎంతో మంది నటీనటులు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అంటూ రవితేజతో కలిసి హిట్ కొట్టాడు.

తండ్రికి తగ్గ తనయుడిగా...: ఇక బాలయ్య బాబు విషయానికి వస్తే.. నందమూరి తారకరామారావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కరోనా టైంలో అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలయ్య ఆ తర్వాత అన్ స్టాపబుల్ షోతో బుల్లితెరపై కూడా సందడి చేశాడు. ఇక ఈ షోకు మంచి రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్ కూడా తీశారు. ఇది కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు బాలయ్య.
ఇద్దరు జోష్ మీదనే...: ఫుల్ జోష్ మీదున్న హీరోస్.. కలిసి ఓ సినిమా చేస్తే చూడాలని అభిమానులు అనుకుంటూ ఉంటారు. ఆమధ్య అన్ స్టాపబుల్ షోలో కూడా అల్లు అరవింద్, రాఘవేంద్రరావు మాట్లాడుతూ... బాలయ్య, చిరంజీవి కలిసి సినిమా తీస్తే.. పాన్ వరల్డ్ సినిమా అవుతుంది అని అన్నారు. కానీ వీళ్లు ఇంతకు ముందే ఓ సినిమాలో కలిసి నటించారు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు.

ఆ సినిమాలో కలిసి...: విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన సినిమా త్రిముర్తులు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ, చిరంజీవి కనిపిస్తారు. వీరిద్దరే కాకుండా, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, నాగార్జున, శోభన్ బాబులు కూడా కనిపిస్తారు. ఈ సినిమా తరువాత మళ్లీ బాలయ్య చిరు కలిసి నటించలేదు. మంచి కథ దొరికితే.. రాబోయే రోజుల్లో వీరు ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తారేమో... ఒకవేళ చేస్తే... ఈ ఇద్దరి ఫ్యాన్స్ ను ఆపడం కష్టమే.

ఇద్దరి సినిమాలు రిలీజ్ కు సిద్ధం..: ప్రస్తుతం బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.


Click it and Unblock the Notifications











