Viswambhara: మెగా ఫ్యాన్స్‌కు యంగ్ డైరెక్టర్ సర్‌ప్రైజ్.. ఏంటి అప్పుడే అయిపోయిందా!
తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. చాలా ఏళ్లు సినీ రంగానికి గ్యాప్ తీసుకున్నప్పటికీ ఆయన రేంజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దీనికితోడు రీఎంట్రీలోనూ చిరంజీవి మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. తద్వారా అభిమానులను అలరిస్తూనే ముందుకు సాగుతున్నారు.
గతంలో కంటే ఇప్పుడు ఎంతో వేగంగా మూవీలు చేస్తోన్న చిరంజీవి.. ఇటీవలే ఇటీవలే 'భోళా శంకర్' మూవీతో వచ్చారు. ఈ చిత్రం మాత్రం భారీ నష్టాలతో డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం చిరు ఇప్పుడు 'బింబిసార' దర్శకుడు మల్లిడి వశిష్టతో ఓ సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కలిసి చేస్తున్న ఈ చిత్రాన్ని సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కాన్సెప్టు పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో పంచ భూతాలను చూపించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు. అలాగే, పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టేశారు.
సీనియర్ స్టార్ హీరో చిరంజీవితో యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌పై తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు డైరెక్టర్ మల్లిడి వశిష్ట తెలిపాడు. ఈ మేరకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌తో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్ని రివీల్ చేశాడు.
దాదాపు వారం రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో ఎంతో ముఖ్యమైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిసింది. అదే సమయంలో వేగంగా కొంత టాకీ పార్టును పూర్తి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదే స్పీడు కంటిన్యూ చేసి ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. చిరంజీవి - వశిష్టం కాంబోలో వస్తున్న ఈ సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో అనుష్క శెట్టి సహా మరికొందరు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలిసింది. అలాగే, దగ్గుబాటి రానా విలన్‌గా చేస్తున్నాడని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











