Chiru 156: చిరంజీవి కొత్త సినిమా అఫీషియల్ టైటిల్ లీక్.. బయటకు వచ్చిన స్క్రిప్ట్
తెలుగు చిత్ర పరిశ్రమలో కుర్ర హీరోల కంటే సీనియర్ స్టార్లే వేగంగా సినిమాలు చేస్తున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మెగాస్టార్ చిరంజీవిదే. అంతలా ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వేగంగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అయితే, 'భోళా శంకర్'తో మాత్రం డిసప్పాయింట్ చేసేశారు.
గత చిత్రంతో బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను చవి చూసిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకోవాలన్న కసితో ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ స్టార్ హీరో 'బింబిసార'తో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న దర్శకుడు మల్లిడి వశిష్టతో ఓ సినిమాను చేయబోతున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కాన్సెప్టు పోస్టర్‌లో పంచ భూతాలను చూపించి దీనిపై ఆసక్తిని పెంచేశారు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
విభిన్నమైన కాన్సెప్టుతో విజువల్ వండర్‌గా రాబోయే ఈ సినిమాలో హీరో లోకాల్లో తిరుగుతూ ప్రేక్షకులను మైమరించబోతున్నాడని తెలిసింది. అలా ఆయా లోకాలకు వెళ్లిన అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కబోతుందని ఇప్పటికే న్యూస్ వచ్చింది. అలాగే, ఇందులో ఎంతో మంది హీరోయిన్లు కూడా ఉంటారని అంటున్నారు.

ఆరంభంలోనే అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రానికి 'విశ్వంభర' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ఇప్పటికే ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ సినిమా స్క్రిప్టు ఫైల్ ఫొటో బయటకు వచ్చింది. దాని మీద కూడా ఇదే టైటిల్ ఉంది. దీంతో 'విశ్వంభర' అనే టైటిల్‌నే చిరంజీవి కోసం ఫిక్స్ చేశారని అందరికీ క్లారిటీ వచ్చేసింది.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని దాదాపు రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో హీరోయిన్‌లుగా అనుష్క శెట్టి, త్రిషలను తీసుకున్నారట. అలాగే, విలన్‌గా దగ్గుబాటి రానాను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించబోతున్నారు.


Click it and Unblock the Notifications











