Love Story ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా.. అయినా మెగా సర్ప్రైజ్ తో ముందుకు?
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ సినిమా అనేక అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉన్నా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీక్ ఈవెంట్ విషయంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్
నిజానికి ఈ లవ్ స్టోరీ ఈ నెల పదో తారీఖున విడుదల చేయాల్సి ఉన్నా నాని టక్ జగదీష్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్న కారణంగా ఈ సినిమా విడుదల మళ్లీ వాయిదా వేశారు. చివరిగా ప్రకటించిన దాని ప్రకారం ఈ సినిమా 24వ తేదీన విడుదల కాబోతోంది. అయితే సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడిన యూనిట్ రేపు పార్క్ హయత్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.

కరోనా సెకెండ్ వేవ్ తో
విభిన్న చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి నాగచైతన్య హీరో హీరోయిన్లుగా లవ్ స్టోరీ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు అనేక కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముందు విడుదల చేద్దాం అంటే కరోనా సెకండ్ వచ్చి పడింది. తర్వాత థియేటర్ లో ఓపెన్ అయ్యాక రిలీజ్ చేయాలి అంటే నాని సినిమా అమెజాన్ లో విడుదల చేస్తున్నారు అనే విషయంతో నిర్మాతలు ఏకీభవించగా ఎగ్జిబిటర్ లతో మీటింగులు పెట్టి పెద్ద చర్చకు దారి తీశారు. ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో వెనక్కి తగ్గి సినిమాను 24 వ తేదీన విడుదల చేస్తున్నామని ప్రకటించారు.

పార్క్ హయత్ లో
తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా 24వ తేదీన విడుదల కాబోతున్న క్రమంలో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ప్రారంభించింది యూనిట్. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం గ్రాండ్ గా ప్లాన్ చేయాలని భావిస్తూ వచ్చారు. అందులో భాగంగానే రేపు అంటే 17వ తారీఖున పార్క్ హయత్ లో దీనిని చేద్దాం అని అనుకున్నారు.

చిరంజీవి కోసమే
కానీ ముఖ్యఅతిథిగా చిరంజీవిని హాజరు కమ్మని కోరగా ఆయన 17వ తేదీన బిజీగా ఉంటారని 19వ తేదీన అయితే హాజరుకాగలనని చెప్పడంతో చిరంజీవి వస్తానన్న 19వ తేదీనే ఈ ఈవెంట్ జరపడానికి ఫిక్స్ అయ్యారు. అయితే చిరంజీవి చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా తనను కలిసి మద్దతు కోరిన అన్ని సినిమాలకు అండగా నిలబడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ కి కూడా హాజరు కాబోతున్నారు. నాగార్జున కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హాజరు కాబోతున్నారు.
Recommended Video

సూపర్ క్రేజ్
పవన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇటివలే సూపర్ హిట్ అయ్యాయి. నాలుగు పాటలు అయితే ఇప్పటికీ యూట్యూబ్ లో ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు. ఫిదా లాంటి సూపర్ హిట్ కొట్టిన తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా కావడంతో పాటు మొన్న విడుదలైన ట్రైలర్ కూడా సినిమా మీద ఆసక్తి పెంచేసింది. మరి చూడాలి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకోబోతోంది అనేది.


Click it and Unblock the Notifications











