రాజమౌళి ప్రకటన కోసం చిరంజీవి, ప్రభాస్ వెయిటింగ్.. అనుమానాలకు బలం చేకూరినట్లే.!
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్ల లిస్టులో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చేరిపోయారు. దీనికి కారణం ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్లుగా నిలవడమే. అంతేకాదు, వాటిలో కొన్ని ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి. అందుకే ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటూ ఉంటాడు. అలాగే, రాజమౌళిని దృష్టిలో ఉంచుకుని చాలా మంది తమ తమ ఫ్యూచర్ ఫ్లాన్లను కూడా అమలు చేస్తుంటారు. తాజాగా ఈ జాబితాలోకి చేరిపోయారట మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అసలేంటీ కథ.? పూర్తి వివరాల్లోకి వెళితే....

ఇద్దరినీ కలిపాడు.. భారీగా ప్రాజెక్టు చేస్తున్నాడు
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమా RRR. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పోరాట యోధులు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రకు కొన్ని ఊహాజనిత సన్నివేశాలు జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఇందులో చాలా మంది ప్రముఖులు నటిస్తున్నారు.

చాలా వరకు పూర్తయింది.. అసలైంది మిగిలింది
ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాది ముగిసింది. అప్పటి నుంచి దీని చిత్రీకరణ డెబ్బై శాతం పైగా పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ స్వయంగా వెల్లడించింది. ఇక, మిగిలిన ముప్పై శాతం షూటింగ్‌లో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ సహా పలు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. అలాగే, కొన్ని పాటలు కూడా ఉంటాయని టాక్.

అప్పటికి అయ్యేది అనుమానామే.. మారుస్తారు
వాస్తవానికి RRR సినిమా యూనిట్ నిర్వహించిన మొదటి ప్రెస్‌మీట్‌లోనే దీని విడుదల తేదీని కూడా ప్రకటించారు. జూలై 30, 2020న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అప్పుడు చెప్పారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదన్న టాక్ ఉంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలా సమయం పట్టే చాన్స్ ఉండడంతో డేట్ మారుస్తారని అంటున్నారు.

ప్రకటన కోసం చిరంజీవి, ప్రభాస్ వెయిటింగ్
ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఓ బడా సినిమా విడుదల అవుతుంటే.. దానికి పోటీగా మరే సినిమానూ విడుదల చేయడం లేదు. సో.. RRR వస్తే తమ సినిమాల విడుదల తేదీలను మార్చడానికి చాలా మంది హీరోలు సిద్ధంగా ఉన్నారు. ఆ జాబితాలోకే ప్రభాస్, చిరంజీవి వచ్చారని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

పోటీని తట్టుకోలేక కాదు.. ఫ్రెండ్‌షిప్ కోసం
ప్రస్తుతం ప్రభాస్.. ‘జాన్' (వర్కింగ్ టైటిల్) అనే సినిమాలో నటిస్తున్నాడు. అలాగే, చిరంజీవి.. కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల రిలీజ్ డేట్లు ప్రకటించలేదు. దీనికి కారణం RRR ఎప్పుడొస్తుందనేది క్లారిటీ లేకపోవడమేనని తెలుస్తోంది. ఈ చిత్ర యూనిట్‌తో వాళ్లిరువురికీ సన్నిహిత సంబంధాలు ఉండడం వల్లే ఆ ప్రకటన కోసం వేచి చూస్తున్నారని తెలిసింది.

అనుమానాలకు బలం చేకూరినట్లే.!
ఇప్పటికే RRR వాయిదా పడుతుందని ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాజాగా బయటకు వచ్చిన ఈ అంశం వల్ల ఆ అనుమానాలకు బలం చేకూరినట్లైంది. అలాగే, ఈ సినిమా రిలీజ్ డేట్ మార్పునకు సంబంధించిన ప్రకటన కూడా త్వరలోనే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో అటు మెగా అభిమానులు.. ఇటు నందమూరి ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.


Click it and Unblock the Notifications











