twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    PelliSandaD: దర్శకేంద్రుడితో చిరంజీవి, వెంకటేష్.. స్టార్ కిడ్ కోసం ఏకమైన ఇద్దరు బడా హీరోలు

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోనే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఒకరు. సుదీర్ఘమైన ప్రయాణంలో వందకు పైగా చిత్రాలను తెరకెక్కించిన ఆయనను ప్రత్యేకమైన శైలి ఉంది. అందుకే ఈయన చిత్రాల్లో నటించాలని ప్రతి హీరో, హీరోయిన్లు కోరుకునే వాళ్లు. మరీ ముఖ్యంగా రాఘవేంద్రరావు సినిమాల్లో హీరోయిన్లను చూపించే విధానం చాలా స్పెషల్‌గా ఉంటుంది. అలాగే, హీరో పాత్రలు కూడా ఎంతో ఎలివేషన్‌తో ఉండేవి. అందుకే ఆయన అనుగ్రహం కోసం చాలా మంది వేచి చూసేశారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వానికి దూరంగా ఉన్నా.. సినిమాలకు మాత్రం దగ్గరగానే ఉన్నారు.

    <strong>హాట్ షో రెచ్చిపోయిన మోనాల్ గజ్జర్: గతంలో ఎన్నడూ చూడనంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!</strong>హాట్ షో రెచ్చిపోయిన మోనాల్ గజ్జర్: గతంలో ఎన్నడూ చూడనంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

    రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఎవర్ గ్రీన్ చిత్రాల్లో 'పెళ్లి సందడి' ఒకటి. శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడిదే టైటిల్‌తో వస్తున్న 'పెళ్లిసందD' సినిమా ద్వారా రాఘవేంద్రరావు నటుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా.. శ్రీలీలా హీరోయిన్‌గా వస్తున్న ఈ సినిమాను గౌరీ రోణంకి తెరకెక్కిస్తున్నారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరూ ఫోకస్ చేస్తున్నారు.

    Chiranjeevi and Venkatesh chief guests PelliSandaD Pre Release Event

    'పెళ్లిసందD' మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. అయితే, మధ్య కరోనా లాక్‌డౌన్లు వచ్చిన కారణంగా ఈ సినిమాకు వరుస ఆటంకాలు ఎదురయ్యాయి. దీని ప్రభావం షూటింగ్‌పై తీవ్ర స్థాయిలో చూపించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే చిత్రీకరణను పూర్తి చేసేశారు. అంతేకాదు, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసి విడుదలకు సిద్ధం చేశారు. ఇక, కొద్ది రోజులుగా ఈ మూవీ నుంచి పలు పాటలు, టీజర్ సహా ఎన్నో పోస్టర్లు విడుదలయ్యాయి. వాటన్నింటికీ భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

    స్విమ్‌సూట్‌లో కనిపించి షాకిచ్చిన ఈషా రెబ్బా: తడిచిన బట్టల్లో అందాలన్నీ చూపించిన తెలుగమ్మాయిస్విమ్‌సూట్‌లో కనిపించి షాకిచ్చిన ఈషా రెబ్బా: తడిచిన బట్టల్లో అందాలన్నీ చూపించిన తెలుగమ్మాయి

    ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పెళ్లిసందD' మూవీని అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో 10వ తేదీ అంటే ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభం అయ్యే ఈ వేడుకకు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, దగ్గుబాటి వెంకటేష్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. దీంతో ఈ ఈవెంట్ ఎంతో గ్రాండ్‌గా జరగబోతుందని అర్థం అవుతోంది.

    కుటుంబ కథకు అన్ని హంగులూ మేళవించి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పెళ్లిసందD' మూవీలో రాఘవేంద్రరావు స్టైలిష్ గెటప్‌లో కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ఆయన అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. అలాగే, యాక్షన్ సీన్‌లోనూ భాగమైనట్లు చూపించారు. ఇక, ఈ సినిమాను ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతం అందించారు. ఇక, ఈ మూవీకి రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణ కూడా చేశారు.

    English summary
    Roshann, Sree Leela and K. Raghavendra Rao Did PelliSandaD Movie Under Gowri Ronanki Direction. Chiranjeevi and Venkatesh chief guests for This Movie Event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X