Chiranjeevi: చిరంజీవి గొప్పతనం అదే.. అలా వస్తే శత్రువునైనా క్షమిస్తారంటున్న స్టార్ డైరెక్టర్
Chiranjeevi- Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. భోళా శంకర్ తర్వాత కొంత విరామం తీసుకున్న ఆయన, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అందులో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మనశంకర వరప్రసాద్ గారు' సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవ్వనున్నట్టు సమాచారం.
చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబో మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ లో నటించబోతున్నారట. ఇప్పటికే విడుదలైన 'మీసాల పిల్లా' పాటకు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. గతంలో చిరంజీవితో మరో సినిమా చేయాల్సి ఉందని, అయితే డేట్స్ సమస్యల వల్ల ఆ సినిమా జరగలేదని చెప్పారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. 'అనవసరంగా డిలే అవుతుండడంతో, చిరంజీవి గారికి చెప్పకుండా నేనే వెళ్లిపోయా. సడన్‌గా ప్రాజెక్ట్ నుండి జంప్ అయ్యాను'అని అనిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై యాంకర్ ప్రేమ 'మిమ్మల్ని క్షమించి మళ్లీ మీతో సినిమా చేస్తున్నారా?' అని అడగగా, అనిల్ స్పందిస్తూ 'అదే చిరంజీవి గారి గొప్పతనం. అతడు సినిమాను చాలా ప్రేమిస్తాడు. టెక్నీషియన్స్ కూడా గౌరవిస్తాడు. మొదటిసారి కలిసిన రోజే ఈ కుర్రోడిలో ఏదో ఒక విషయం ఉంటుంది అన్న ఫీల్ వచ్చేసిందని చిరు చెప్పేవారు" అని వెల్లడించారు.
ఇక అనిల్ మాట్లాడుతూ.. 'నేను కూడా చిరంజీవి గారితో సినిమా చేయాలని సంక్రాంతి వస్తున్నాం సినిమా సక్సెస్ అయిన తర్వాత మెగాస్టార్ ను కలిసాను. మీతో సినిమా చేయాలి సార్.. కచ్చితంగా ఈసారి సినిమా చేస్తా. ఎలాంటి కోపం లేకుండా చాలా ఎక్సైట్ మెంట్ తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. చిరంజీవి గారి దగ్గర ఎలాంటి కోపం ఉండదు. వేరే హీరో అయితే మనసులో పెట్టుకునేవారేమో.. కానీ చిరంజీవి గారు మాత్రం అలా కాదు. నాలుగు తరాలను చూసిన మెగాస్టార్ అయినా.. ఇప్పటికీ అందరినీ ప్రేమతో చూస్తారు. శత్రువుకు కూడా పాజిటివ్‌గా స్పందిస్తారు. ఆ ఓపికే ఆయన గ్రేట్‌నెస్." అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
చిరంజీవితో పని చేస్తున్న అనుభవం గురించి అనిల్ మాట్లాడుతూ.. 'ఇప్పటివరకు స్క్రీన్ పై చూసిన ఆయనను నేను డైరెక్ట్ చేస్తున్నా అంటే అదృష్టం. చిరంజీవి ఒక సెన్సేషన్. ఆయనను చూసి ఎంతో మంది ఇండస్ట్రీలోకి వచ్చారు. ఓ కామన్ మ్యాన్‌గా ప్రారంభమైన ప్రయాణం.. మెగాస్టార్‌గా ఎదిగి తెలుగు సినీ పరిశ్రమను ఏలుతున్నారు. ఆయన ఒక జనరేషన్‌కు ప్రేరణ.' అంటూ మెగాస్టార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


Click it and Unblock the Notifications











