చిరంజీవి అనిల్ ప్రాజెక్ట్ షురూ.. ఆ కాంబినేషన్ రిపీట్ చేస్తున్న దర్శకుడు

మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చిత్రం ఎట్టకేళలకు ప్రారంభమైంది. ఉగాది పర్వదినాన్ని పుర్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. ఈ మెగా ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. Mega157 ప్రాజెక్ట్‌ను ఈరోజు అధికారికంగా పూజా కార్యక్రమంతో ప్రారంభిచంగా.. విక్టరీ వెంటకేశ్ క్లాప్‌బోర్డ్ ఇచ్చారు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఇక లెజెండరీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు మొదటి షాట్‌కు దర్శకత్వం వహించడం విశేషంగా మారింది.

స్టార్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ నాగ వంశీ, యూవీ క్రియేషన్స్ విక్రమ్ ఉన్నారు. మరోవైపు ఈ లాంచింగ్ వేడుకలో యంగ్ డైరెక్టర్స్ వశిష్ట, శ్రీకాంత్ ఓదెల, బాబీ, శివ నిర్వాణ, వంశీ పైడిపల్లి ఉన్నారు. అలాగే మైత్రి నవీన్, రవి, శిరీష్, అశ్విని దత్, రామ్ ఆచంట, శరత్ మరార్, విజయేంద్ర ప్రసాద్, కెఎస్ రామారావు, కెఎల్ నారాయణ, సురేష్ బాబు, వెంకట సతీష్ కిలారు, జెమిని కిరణ్, చుక్కపల్లి అవినాష్, జెమిని కిరణ్, నిమకాయల ప్రసాద్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.

Chiranjeevi Anil Ravipudi Project Launched with Grand Pooja Ceremony

ఎప్పటి నుంచో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. కాగా ఉగాది పండగ రోజే సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సాహు గారపాటి, మెగా డాటర్ సుష్మిత కొణిదెల నిర్మాతలుగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో సంయుక్తంగా Mega 157 ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నారు. కొణిదెల సుష్మిత నిర్మాతగా ఉండటం ఈ సినిమాకు విశేషంగా మారింది.

ఇదిలా ఉంటే.. అనిల్ రావిపూడి తన మొదటి చిత్రం 'పటాస్' నుంచి మొన్నటి సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేశ్ చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' వరకు 8 చిత్రాలతో సక్సెస్ అందుకున్నారు. వందశాతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోయారు. అయితే మెగా157 ప్రాజెక్ట్ కు అనిల్ రావిపూడి తన హిట్ కాంబినేషన్ అయిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ టెక్నీషియన్స్ నే ఎంపిక చేసుకున్నారంట. వారితోనే మెగాస్టార్ ను మునుపెన్నడూ చూడని విధంగా, వింటేజ్ చిరును గుర్తు చేసేలా సినిమా తీయబోతున్నారు.

Chiranjeevi Anil Ravipudi Project Launched with Grand Pooja Ceremony

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్న చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు 'శివ శంకర వరప్రసాద్'నే చిరు పాత్రకు వాడుకోబోతుండటం విశేషం. ఇక అన్ని జోనర్లలో సినిమాలు చేసి బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకున్న మెగాస్టార్ చిరంజీవిని అనిల్ రావిపూడి ఎలా చూపించబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ చిత్రం కూడా ఫ్యామిలీ డ్రామాతో పాటు కామెడీ, యాక్షన్ అంశాలతో మిళితమై ఉంటుందని మాత్రం గతంలో అనిల్ చెప్పుకొచ్చారు. సినిమాటోగ్రాఫర్ గా సమీర్ రెడ్డి, సంగీత దర్శకుడుగా భీమ్స్ సిసిరోలియో వ్యవహరిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ఎస్ కృష్ణ, జీ ఆది నారాయణ రచయితగా సహకరించారు. ఎస్ కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X