Mega 157 టీమ్ వార్నింగ్.. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు వాల్తేరు వీరయ్య చిత్రం మొదలు టాలీవుడ్ లోని యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. యంగ్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో నెక్ట్స్ చిరు నుంచి రాబోయే సినిమాలన్నీ యువ దర్శకుల చేతుల్లోనే ఉన్నాయి. అందులో మెగా 157 చిత్రం ఒకటి ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో జరిగిన పొరపాటుపై తాజాగా యూనిట్ సీరియస్ వార్నింగ్ ఇస్తూ నోట్ విడుదల చేయడం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళితే..

2 షెడ్యూల్స్ పూర్తి..
మెగా 157 చిత్రాన్ని టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవిని తనదైన శైలిలో, వింటేజ్ లుక్ లో అభిమానులకు, ప్రేక్షకులకు త్వరగా చూపించాలని ఎంతో ఆశపడుతున్నారు. ఈ క్రమంలో షూటింగ్ పార్ట్ ను చకా చకా పూర్తి చేస్తున్నారు. మే స్టార్ట్ అయిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటి వరకు 2 షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. 3వ షెడ్యూల్ షూటింగ్ కూడా శరవేగంగా కొనసాగుతోంది. త్వరలోనే షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేయబోతున్నారు.

Chiranjeevi Anil Ravipudi Upcoming Movie Mega 157 Latest News

వీడియో క్లిప్ లీక్.. టీమ్ వార్నింగ్..
అయితే మెగా 157 చిత్రం సెట్స్ లో తాజాగా కీలక సన్నివేశాన్ని చిత్రీకరించారంట. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో చేరింది. దీంతో వెంటనే మెగా 157 మేకర్స్, టీమ్ అలర్ట్ అయ్యింది. అయితే కేరళలో జరిగిన షూటింగ్ కు సంబంధించిన వీడియో క్లిప్ ను వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా తమ సినిమాను స్పాయిల్ చేయాలని చూస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

నోట్ లో ఇలా..
సోషల్ మీడియాలో మెగా 157కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేర్ అవుతున్నాయని మేం గమనించాం. కొందరు అనధికారికంగా, దొంగదారిన షూటింగ్ సెట్స్ లో షూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారి వల్ల కంటెంట్ బయటికి వస్తోందని అది మా దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై అలాంటి పనులకు మానుకోవాలని, లేదంటే పైరసీ, కాపీ రైట్ కింద కేసులు నమోదు చేస్తాం. ఎంతో మంది టెక్నీషియన్లు, టీమ్ ఇక్కడ పని చేస్తున్నారు.

వారి శ్రమను గుర్తించైనా ఇలాంటి పనులు మానుకోవాలి. చట్ట విరుద్ధమైన పనులకు దూరంగా ఉండండి. మా దృష్టికి వస్తే మాత్రం పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటాం. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. అప్పడు అఫీషియల్ పోస్ట్ లను మాత్రమే షేర్ చేయండి.. అని నిర్మాణ సంస్థ చెప్పుకొచ్చింది. ఇక ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతగా కొణిదెల సుష్మితా వ్యవహరించడం విశేషం. లేడీ సూపర్ స్టార్ నయనతార చిరు సరసన నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. 2026 సంక్రాంతికి విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X