Virupaksha: మేనల్లుడి చిత్రంపై చిరంజీవి రియాక్షన్.. ఆ ఫొటో షేర్ చేస్తూ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు సాయి ధరమ్ తేజ్. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా పలు విభాగాల్లో అదరగొట్టి సుప్రీమ్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అనేక చిత్రాల్లో నటించి సాయి ధరమ్ తేజ్ కు హిట్ అందించిన చిత్రాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అయినా పట్టువిడకుండా ఆద్యంతం ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నించాడు. తాజాగా విరూపాక్ష మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాపై చిరు రియాక్ట్ అవుతూ ట్వీట్ చేశారు.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ 15వ చిత్రంగా నటించిన చిత్రం 'విరూపాక్ష'. కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమాలో మలయాళ బ్యూటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా, ముద్దుగుమ్మ సోనియా సింగ్ ఫీమెల్ లీడ్ రోల్ చేసింది. సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మించిన సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా తాజాగా అంటే ఏప్రిల్ 21న శుక్రవారం విడుదలైంది.

డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన విరూపాక్ష సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వస్తోంది. పాజిటివ్ రివ్యూలతోపాటు నటీనటులు, చిత్రబృందంపై ప్రశంసలు కురుస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ నటనపై సినీ ఇండస్ట్రీ నుంచి అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ మేనమామ, మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.
"సాయి ధరమ్ తేజ్ కు చిరంజీవి సతీమణి సురేఖ కేక్ తినిపిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ స్పెషల్ నోట్ రాసుకొచ్చారు. విరూపాక్ష సినిమా గురించి అద్భుతమైన రిపోర్ట్స్ వినబడుతున్నాయి. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా డియర్ సాయి ధరమ్ తేజ్. నీ కమ్ బ్యాక్ దద్దరిల్లిపోయింది. ఈ సినిమాను ప్రేక్షకులు అభినందిస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. విరూపాక్ష సినిమా టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు" అని చిరు రాసుకొచ్చారు.
చిరంజీవి ట్వీట్ చేస్తూ విరూపాక్ష మూవీ డైరెక్టర్ కార్తిక్ వర్మ దండు, హీరోయిన్ సంయుక్త మీనన్, మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్, ఎడిటర్ నవీన్ నూలిని ట్యాగ్ చేశారు. ఇదిలా ఉంటే యాక్సిడెంట్ తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ కు మంచి కమ్ బ్యాక్ వచ్చినట్లయింది. ప్రమాదం తర్వాత మాట్లాడేందుకు కూడా చాలా కష్టపడినట్లు, ఎంతో ప్రాక్టీస్ చేసి డైలాగ్స్ చెప్పినట్లుగా సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.


Click it and Unblock the Notifications











