twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగోళ్ళందరూ గర్వ పడే క్షణాలు...Sirisha Bandlaకి మెగాస్టార్ శుభాకంక్షలు!

    |

    ఆంధ్ర ప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లా మూలాలున్న శిరీష బండ్ల అనే యువతి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్‌ సంస్థ సిద్దం చేసిన' వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ' అనే స్పెషల్ స్పేస్ షిప్ ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు ఆమె సిద్ధమవుతోంది. ఆమె మొదటి ఇండియన్ లేడీ కల్పనా చావ్లా, ఇండియన్‌ అమెరికన్‌ సునీతా విలయమ్స్‌ తరువాత అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న ఇండియన్ మూలాలున్న మహిళల సరసన చేరారని చెప్పచ్చు.

    అంతే కాక అలాగే ఈ ఘనత సాధించిన తొలి తెలుగు వ్యక్తిగా నిలిచారు. అలాగే నాల్గవ భారతీయురాలుగా నిలిచారు. ఇక అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఈ స్పేస్ షిప్ ను నింగిలోకి పంపనుంది. ఇందులో సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్‌ తో పాటు ఐదుగురు ప్రయాణికులకు అవకాశం దక్కింది. ఆ ఐదుగురిలో సంస్థ ఉపాధ్యక్షురాలు, తెలుగు మూలాలున్న శిరీష కి​ కూడా చోటు సంపాదించుకోవడం విశేషంగా నిలిచింది.

     chiranjeevi appreciates Sirisha Bandla for her space travel

    ఇప్పటికే ఆమెకు దాదాపు ఆమెకు చాలా మంది శుభాకాంక్షలు తెలుపగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఒక కోసం అద్భుతమైన ఫీట్, శిరీష బండ్ల, స్టార్స్ చేరుకుంటున్న మొదటి తెలుగు అమ్మాయి, ఆమె తల్లిదండ్రులకే కాక తెలుగు వారు సహా భారతీయులందరికీ ఆమె గర్వకారణం అని అన్నారు. అభినందనలు, మీ మిషన్ గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇక 'వర్జిన్ గెలాక్టిక్' స్పేస్ షిప్ బ్రాన్సన్‌ తో కలిసి మరో ఆరుగురితో యూనిటీ 22 టెస్ట్ ఫ్లైట్ జూలై 11, గురువారం సాయంత్రం న్యూ మెక్సికో నుండి బయలు దేరుతుంది. ఇక మొత్తం మీద తెలుగమ్మాయి, చర్చనీయాంశంగా మారిందని మాత్రం చెప్పవచ్చు.

    English summary
    Sirisha Bandla, astronaut number 4 on the Virgin Galactic space mission crew, was born in Andhra Pradesh. megastar chiranjeevi, congrats her recently.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X