రాజస్థాన్‌లో వైభవంగా ఎంపీ బాలశౌరి కుమారుడి వివాహం.. చిరంజీవితోపాటు ఎవరు హాజరయ్యారంటే..
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహం ఘనంగా జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌గా రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ప్రముఖ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లికి సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ పెళ్లికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

రాయల్ ఏర్పాట్లతో కళ్లు చెదిరేలా
ఎంపీ బాలశౌరి కుమారుడు అనుదీప్ పెళ్లి వేడుక రాజవంశానికి చెందిన వారికి ఏ మాత్రం తీసిపోకుండా కళ్లు చెదిరేలా జరిగింది. సోమవారం జరిగిన ఈ పెళ్లి వేడుకలో వధువు స్నికిత మెడలో అనుదీప్ మూడుమూళ్లు వేశారు. దాంతో స్నికిత, అనుదీప్ దంపతులు ఒక్కటయ్ాయరు.

సంప్రదాయ పద్దతిలో
పెళ్లికి ముందు రెండు రోజులపాటు వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా సంగీత్ కార్యక్రమం, హల్దీ ఈవెంట్, పెండ్లి కొడుకుగా తయారు చేయడం, పెళ్లి కూతురు తయారు చేసే వేడుకలు అత్యంత సంప్రదాయకంగా హిందూ ఆచారం ప్రకారం జరిగాయి. ఈ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగి ఆహుతులను అలరించాయి.

చిరంజీవి స్పెషల్ ఎట్రాక్షన్‌గా
ఎంపీ బాలశౌరి పెళ్లి వేడుకలో సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వివాహానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు సతీ సమేతంగా హాజరై నూతన వధూవరులను అశ్వీరదించారు. గతంలో హైదరాబాద్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ వేడుకకు కూడా చిరంజీవి, తన సతీమణి సురేఖతో హాజరైన సంగతి తెలిసిందే.

హాజరైన ప్రముఖులు ఎవరంటే..
ఎంపీ బాలశౌరి కుమారుడు అనుదీప్ పెళ్లి కార్యక్రమంలో ఏపీ, రాష్ట్ర మంత్రి పేర్ని నాని, అరకు ఎంపి మాధవి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, శాసన సభ్యులు పార్థ సారధి, అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, జోగి రమేష్, రెడ్డి శాంతి, గ్రీన్ కో MD చలమల శెట్టి గోపి, AMR గ్రూప్ అధినేత మహేశ్ రెడ్డి, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు శ్రీనివాస నాయుడు, విడుదల కుమార స్వామి, భైరా దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.


Click it and Unblock the Notifications











