twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దటీజ్ చిరు.. అభిమానికి ఆడియో మెసేజ్.. ఇంతకన్నా ఇంకేం కావాలి!

    |

    అభిమానులు లేనిదే సినిమా హీరోలు లేరు అలాగే సినిమా హీరోలు లేనిదే వాళ్ళ అభిమానులు ఉండరు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా హీరోలకు అభిమానులకు ఉన్న అవినాభావ సంబంధం వారికి తప్ప మరెవరికీ అర్థం కాదు. అలాగే హీరోలకు బలం బలహీనత రెండూ అభిమానులే అని చెప్పక తప్పదు. మరీ ముఖ్యంగా సినిమా రంగంలో దాదాపు అందరు హీరోలు తమ అభిమానులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు.. ముఖ్యంగా చిరంజీవి మాత్రం అభిమానులు అంటే ప్రాణం ఇస్తారు. తన అభిమానులు ఎంతగా అభిమానిస్తారో అభిమానులను కూడా చిరంజీవి అంతేగా అభిమానిస్తారు. తాజాగా కరోనా సమయంలో తన అభిమానికి చిరంజీవి పంపిన ఒక వాయిస్ మెసేజ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. ఆ వివరాల్లోకి వెళితే

    ఫ్యాన్స్ అంటే ప్రాణం

    ఫ్యాన్స్ అంటే ప్రాణం

    మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఇంత క్రేజ్ సంపాదించారు అంటే దానికి కారణం అభిమానులే అని స్వయంగా చెబుతూ ఉంటారు. తన అభిమానులు లేకపోతే తాను ఇంతటి వాడిని అయ్యే వాడిని కాదు అని చిరంజీవి అనేక సందర్భాల్లో వెల్లడించారు. దేశంలో మరే హీరోకు లేనంత క్రేజ్ చిరంజీవికి ఉంది. అందుకే ఆయన అభిమానులు కేవలం చిరంజీవి అభిమానులుగా ఉండకుండా ఆయన పేరుతో సంఘ సేవ కూడా చేస్తూ ఉంటారు.

    వాళ్ళ ఆలోచనతోనే బ్లడ్ బ్యాంక్

    వాళ్ళ ఆలోచనతోనే బ్లడ్ బ్యాంక్

    అభిమానుల చలవతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ స్థాపించామని చిరంజీవి సైతం అని చెబుతూ ఉంటారు..వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను ఆ విషయంలో ముందడుగు వేశానని గతంలో చిరంజీవి వెల్లడించారు. దాదాపు పాతికేళ్ల క్రితం తాను న్యూస్ పేపర్లో రక్తం కొరత ఉన్న కారణంగా రాష్ట్రంలో చాలా మంది చనిపోతున్నారని విషయం తెలుసుకుని తన అభిమానులతో చర్చించగా అభిమానుల నుంచి వచ్చిన ఆలోచనే బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ అని చిరంజీవి చెబుతుంటారు.

    ఫ్యాన్స్ అర్ధమే మార్చేశారు

    ఫ్యాన్స్ అర్ధమే మార్చేశారు

    అనేక సంఘ సేవా కార్యక్రమాలతో ఫాన్స్ అనే పదానికి తన అభిమానులు డెఫినిషన్ మార్చారని చిరంజీవి చెబుతుంటారు. సాధారణంగా అభిమానులు తమ హీరోని పొగుడుతూ అవతల హీరో నితిన్ చేస్తూ ఉంటారని కానీ నా అభిమానులు ఇలా సామాజిక సేవలో పాల్గొనడం వల్ల ఫ్యాన్స్ అనే పదానికి అర్థం పరమార్థం మార్చేశారని చిరు చెబుతూ ఉంటారు.

    సోషల్ మీడియాలో ఆడియో వైరల్

    సోషల్ మీడియాలో ఆడియో వైరల్

    తాజాగా చిరంజీవి తన అభిమాని కి పంపిన ఆడియో మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి అభిమాని ఒకరు తాజాగా తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని ఆయన చిరంజీవి దృష్టికి తీసుకువెళ్లగా కరోనా పరిస్థితుల కారణంగా చిరంజీవి వారికి ఒక వాయిస్ మెసేజ్ పంపించారు. సాధారణంగా అభిమానుల నుంచి మెసేజ్ వస్తే చూసీచూడనట్టుగా వదిలేసే హీరోలు కొంతమంది ఉంటారు. కానీ మెగాస్టార్ వదిలేయలేదు. సూచనలు చేస్తూ ఆయన సదరు అభిమానికి ఆడియో నోట్ పంపారు.

    తల్లి బిడ్డ జాగ్రత్త అంటూ

    తల్లి బిడ్డ జాగ్రత్త అంటూ

    కరోనా కారణంగా ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలని చెబుతూ ఆయన ఆడియో మెసేజ్ పంపారు. తల్లి, బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంది ? అని వాకబు చేసిన చిరంజీవి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఎవరిని ఇంటికి రావద్దని, అలా ఇంటికి రాకుండా ఉండేలా చూసుకోమని తన అభిమానికి సలహా ఇచ్చారు. కరోనా కారణంగా తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలంటే ప్రస్తుతం ఎవరూ వాళ్లని చూడడానికి రాకుండా ఉండడమే మంచిది అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆడియో మెసేజ్ అందుకున్న ఫ్యాన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.

    Recommended Video

    Ravi Teja Replaces Chiranjeevi In Puri Jagannadh's Auto Jaani || Filmibeat Telugu

    దటీజ్ చిరంజీవి

    ఈ మధ్య కాలంలో నాగబాబు అనే మరో అభిమాని కూడా కరోనా సోకడంతో చిరంజీవి ఆయనకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనతో మాట్లాడుతూ నీకు ఏమీ కాదని త్వరలోనే మనం కలుస్తున్నాం అని చెబుతూ సదరు అభిమాని చిరంజీవి ధైర్యం చెప్పిన వైనం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో చిరంజీవి అభిమానులు అందరూ దట్ ఈజ్ చిరంజీవి అంటూ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Chiranjeevi has a huge fan base across all the generations. recently A senior fan of Chiranjeevi has welcomed fatherhood. on the occasion, he has been congratulated by none other than his demi-god Chiranjeevi. An audio message in this regard is going viral on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X