Bhola Shankar First Review: భోళా శంకర్ క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ అలా.. సెన్సార్ రివ్యూ!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో మంచి హిట్లు కొట్టారు. త్వరలో భోళాశంకర్ మూవీతో థియేటర్లలో సందడి చేయనున్నారు. బిల్లా ఫేమ్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తమిళ సూపర్ హిట్ వేదాళం మూవీకి రీమేక్ అని తెలిసిందే. ఇందులో తమన్నా, కీర్తి సురేష్ నటించారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న భోళా శంకర్ సినిమా సెన్సార్ రిపోర్ట్ అండ్ ఫస్ట్ రివ్యూ రానే వచ్చింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన భోళా శంకర్ మూవీ ఎలా ఉందో లుక్కేద్దాం.

వాటి సైజ్ పెంచాలని:ఏకే ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించిన చిరంజీవి భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇటీవల నాలుగు మార్పులతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ధూమ పానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే టెక్ట్స్ సైజ్ పెంచాలని సెన్సార్ బోర్డ్ భోళా శంకర్ మేకర్స్ కు సూచించిదట. అలాగే డ్రగ్స్ వాడకం ప్రమాదం అనే సూచన కూడా చేయాలన్నారని సమాచారం.

Chiranjeevi Bhola Shankar Censor Review And Give UA Certificate With 4 Changes

పదాలు తొలగింపు:ఇక భోళా శంకర్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో విలన్ తలను నరికే సన్నివేశం ఉండగా.. దాన్ని బ్లర్ చేయాలని సెన్సార్ సభ్యులు డిమాండే చేశారు. ఇక చివరిగా బXX బాసిXXX అనే డైలాగ్ పదాన్ని డబ్బింగ్ తో సహా సబ్ టైటిల్ నుంచి తొలగించాలని సూచించారట. ఇలా నాలుగు మార్పులతో 2 గంటల 39 నిమిషాలు ఉన్న భోళా శంకర్ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్.

Chiranjeevi Bhola Shankar Censor Review And Give UA Certificate With 4 Changes

మినిమమ్ గ్యారెంటీ:ఇక భోళా శంకర్ సెన్సార్ రిపోర్ట తర్వాత సభ్యులు మంచి రివ్యూ ఇచ్చారట. మెగాస్టార్ చిరంజీవి నుంచి మరోసారి మాస్ ట్రీట్ తప్పదంటున్నారు. చిరంజీవి మేనరిజం, డైలాగ్స్, యాక్షన్ పీక్స్ లో ఉంటాయట. ప్రేక్షకులు ఆద్యంతం ఎంజాయ్ చేస్తారని టాక్. ఇంటర్వెల్ సీన్ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో అదిరిపోతుందట. మినిమమ్ గ్యారెంటీ సినిమా అని అంటున్నారు.

Chiranjeevi Bhola Shankar Censor Review And Give UA Certificate With 4 Changes

అన్ని రకాల అంశాలు:క్లైమాక్స్ లో సిస్టర్ సెంటిమెంట్ తో కట్టిపడేశారట. సినిమా చాలా రిచ్ గా ఉంటుందని చెబుతున్నారు. కీర్తి సురేష్ పాత్ర కీలకంగా ఉండగా.. తన నటనతో కన్నీళ్లు తెప్పిస్తుందట. తమన్నా గ్లామర్, శ్రీముఖితో స్ఫూఫ్ సీన్స్ మెప్పిస్తాయని టాక్. మొత్తంగా చిరంజీవి అభిమానులు కోరుకునే అన్ని రకాల అంశాలు భోళా శంకర్ లో కనిపిస్తాయని ఇన్ సైడ్ టాక్.

ఒరిజినల్ స్టోరీ:ఇక వేదాళం సినిమా ఒరిజినల్ కథ అలాగే ఉంచి మెగాస్టార్ కు తగినట్లుగా కాస్తా మార్పులు చేశారని సమాచారం. చెల్లెలితో లైఫ్ లీడ్ చేస్తున్న హీరోకు ఫ్లాష్ బ్యాక్ ఉండటం,సెకండాఫ్ లో అది రివీల్ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు. ఇతర సినిమాలను గుర్తు చేసేలా ఊహించే విధంగా సీన్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X