Bhola Shankar నుంచి సర్‌ప్రైజింగ్ న్యూస్: ఆ ఫొటోను వదలడంతో ఫ్యాన్స్ ఖుషీ

సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆయన 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహారెడ్డి' వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఆ వెంటనే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాను ప్రారంభించి.. ఈ మధ్యనే దాన్ని పూర్తి చేసేశారు. ఇది ప్రేక్షకుల ముందుకు రాకుండానే మెగాస్టార్ మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. ఇప్పుడు వాటినే ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లుగా చేస్తూ వస్తున్నారు. ఇలా ఈ సీనియర్ హీరో తీరిక లేకుండా షూటింగ్‌లలో పాల్గొంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కించేసిన విషయం తెలిసిందే. అందులో ఒకటి మలయాళ చిత్రం లూసీఫర్‌కు రీమేక్‌గా వస్తున్న 'గాడ్ ఫాదర్' కాగా.. మరొకటి తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా వస్తున్న 'భోళా శంకర్'. వీటితో పాటు యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోనూ మరో సినిమాను చేస్తున్నారు. ఈ మూడు చిత్రాలనూ ఇప్పటికే మొదలు పెట్టేసిన ఆయన.. వీలైన సమయాన్ని కేటాయించి వాటి షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. ఇక, ఇప్పుడు చిరంజీవి చేస్తున్న చిత్రాల్లో 'భోళా శంకర్' మీదే అందరూ దృష్టి సారించారు. దీనికి కారణం దీన్ని ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరొందిన మెహర్ రమేశ్ తెరకెక్కిస్తుండడమే.

Chiranjeevis Bhola Shankar Fight and Song Complete

సిస్టర్ సెంటిమెంట్ స్టోరీతో పూర్తి స్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న 'భోళా శంకర్' సినిమాలో హీరో సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక, ఈ సినిమాను ఇప్పట్లో ప్రారంభించే అవకాశాలు లేవన్న టాక్ వినిపించింది. కానీ, ఊహించని విధంగా నవంబర్‌లో దీన్ని మొదలు పెట్టేశారు. అప్పటి నుంచి ఎంతో వేగంగా షూటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్ షూటింగ్ గురించి అదిరిపోయే న్యూస్ చెప్పింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ దిగ్విజయంగా పూర్తైందని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు, ఇందులో ఓ భారీ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఓ గ్రాండ్ సాంగ్‌ను కూడా పూర్తి చేసినట్లు తెలిపింది. అలాగే, రెండో షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే మొదలు పెట్టేసినట్లు కూడా వెల్లడించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ ఫొటోను కూడా విడుదల చేసింది. ఇందులో దర్శకుడు మెహర్ రమేష్‌తో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా ఉన్నాడు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో చిరంజీవి స్పీడుకు అంతా షాక్ అవుతున్నారు.

'భోళా శంకర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారట. తమిళ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి దీన్ని మెహర్ రమేశ్ తెరకెక్కించబోతున్నాడు. ఇందులో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అలాగే, ఇందులో బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటింబోతుంది. మహతి స్వర సాగర్ దీనికి సంగీతం సమకూరుస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X