For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bhola Shankar: చిరంజీవి ఫ్యాన్స్‌కు శివరాత్రి కానుక.. అంచనాలు పెంచిన భోళా శంకర్

  |

  పది కాదు.. ఇరవై కాదు.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆరంభం నుంచే తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. ఇప్పుడు ఆరు పదుల వయసులోనూ అదే ఉత్సాహంతో కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహారెడ్డి' అనే చిత్రాలను ప్రేక్షకులకు అందించిన చిరు.. ఆ వెంటనే బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాను ప్రారంభించి.. దాన్ని ఈ మధ్యనే కంప్లీట్ చేసుకున్నారు.

  భర్తతో శ్రీయ శరణ్ హాట్ సెల్ఫీ: ఏకంగా బ్రాతో అతడి మీద పడుకుని రచ్చ

  'ఆచార్య' మూవీ ప్రేక్షకుల ముందుకు రాకుండానే మెగాస్టార్ చిరంజీవి మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టేశారు. ఇప్పుడు వాటినే ఒక్కొక్కటిగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడాయన చేస్తోన్న చిత్రాల్లో తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా వస్తున్న 'భోళా శంకర్' ఒకటి. ఈ సినిమా మీదే అందరూ దృష్టి సారించారు. దీనికి కారణం ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మెహర్ రమేశ్ తెరకెక్కిస్తుండడమే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్‌తో పూర్తి స్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి విధితమే.

  వాస్తవానికి చిరంజీవి లైనప్‌లో ఉన్నప్పటికీ 'భోళా శంకర్' సినిమాను ఇప్పట్లో ప్రారంభించే అవకాశాలు లేవన్న టాక్ వినిపించింది. కానీ, ఊహించని విధంగా గత నవంబర్‌లో దీన్ని మొదలు పెట్టేశారు. అప్పటి నుంచి ఎంతో వేగంగా షూటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాదు, హైదరాబాద్‌లో జరిగిన ఓ షెడ్యూల్‌లో ఓ సూపర్ సాంగ్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా విజయవంతంగా చిత్రీకరించారు. ఆ వెంటనే ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్‌ను కూడా ప్రారంభించారు. చిరంజీవి కరోనా రావడంతో దీనికి బ్రేక్ పడినా.. మరోసారి మొదలెట్టి షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్నారు.

  ఆమెతో కలిసున్న ఫొటోతో షణ్ముఖ్ సర్‌ప్రైజ్: పాత రోజులు గుర్తు చేసేలా జంటగా!

  Chiranjeevis Bhola Shankar First Look On March 1st

  'భోళా శంకర్' మూవీ షూటింగ్ మొదలై చాలా రోజులే అవుతోన్న ఒక్క టైటిల్ పోస్టర్ తప్ప.. మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ చిత్రం నుంచి హీరో ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన తాజాగా వెలువడింది. మార్చి 1వ తేదీన మహా శివరాత్రి పర్వదినం. దీన్ని పురస్కరించుకుని ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతున్నారు. ఆరోజు ఉదయం 9.05 గంటలకు దీన్ని రివీల్ చేయనున్నారు. దీంతో మెగా అభిమానులకు శివరాత్రి రోజు బిగ్ సర్‌ప్రైజ్ ఉండబోతుందన్న మాట.

  క్రేజీ కాంబోలో వస్తున్న 'భోళా శంకర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారని అంటున్నారు. తమిళ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి దీన్ని మెహర్ రమేశ్ రూపొందిస్తున్నాడు. ఇందులో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అలాగే, ఇందులో బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనుంది. మహతి స్వర సాగర్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

  English summary
  Chiranjeevi Doing Bhola Shankar Movie with Director Meher Ramesh. This Movie First Look Will Release On March 1st.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X