Mega Euphoria: పాత రోజులను గుర్తు చేసిన చిరంజీవి.. భోళా శంకర్ లుక్ అదిరిపోయిందిగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా స్టార్ హీరోగా హవాను చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. గతంతో పోలిస్తే సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయిన తర్వాత ఆయన రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహారెడ్డి' వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించిన మెగాస్టార్.. ఆ వెంటనే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాను ప్రారంభించారు. ఇది ప్రేక్షకుల ముందుకు రాకుండానే మెగాస్టార్ మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. ఇప్పుడు వాటినే ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లుగా చేస్తూ వస్తున్నారు. ఇలా ఈ సీనియర్ హీరో తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తోన్న చిత్రాల్లో 'భోళా శంకర్' ఒకటి. తమిళంలో అజిత్ కుమార్ హీరోగా నటించి సూపర్ డూపర్ హిట్ అయిన వేదాళంకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీన్ని టాలీవుడ్‌లో ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరొందిన మెహర్ రమేష్ రూపొందిస్తున్నాడు. సిస్టర్ సెంటిమెంట్ స్టోరీతో పూర్తి స్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న 'భోళా శంకర్' సినిమాలో హీరో సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాను ఇప్పట్లో ప్రారంభించే అవకాశాలు లేవన్న టాక్ వినిపించింది. కానీ, ఊహించని విధంగా నవంబర్‌లో దీన్ని మొదలు పెట్టేశారు.

'భోళా శంకర్' మూవీని ఎంతో వేగంగా చిత్రీకరిస్తున్నారు. మూవీ ఫస్ట్ షెడ్యూల్ దిగ్విజయంగా పూర్తైందని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు, ఇందులో ఓ భారీ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఓ గ్రాండ్ సాంగ్‌ను కూడా పూర్తి చేసినట్లు తెలిపింది. అలాగే, రెండో షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే మొదలు పెట్టేసినట్లు కూడా వెల్లడించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ ఫొటోను కూడా విడుదల చేసింది. దీంతో ఈ సినిమాను త్వరగానే పూర్తి చేసేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈరోజు (జనవరి 1)న 'భోళా శంకర్' మూవీ నుంచి సర్‌ప్రైజ్ రాబోతుందని చిత్ర యూనిట్ ఒకరోజు ముందే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ సినిమా నుంచి ఓ మోషన్ వీడియోను విడుదల చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ లుక్‌తో కనిపించారు. పాత రోజులను గుర్తు చేసేలా ఆయన గెటప్ ఉంది. దీంతో ఈ సినిమాలో ఆయన ఎలా కనిపించబోతున్నారు అన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇక, ఈ మోషన్ వీడియోకు మెగా అభిమానుల నుంచే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'భోళా శంకర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారట. తమిళ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి దీన్ని మెహర్ రమేశ్ తెరకెక్కించబోతున్నాడు. ఇందులో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అలాగే, ఇందులో బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటింబోతుంది. మహతి స్వర సాగర్ దీనికి సంగీతం సమకూరుస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











