Bhola Shankar మే డే ట్రీట్.. చిరంజీవి పాత్ర లీక్ చేసిన మేకర్స్.. స్టైలిష్ పిక్స్ వైరల్!
ఎంతోకాలంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సందడి చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. గతేడాది గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయం అందుకున్న ఆయన ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్యగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దీంతో తర్వాతి సినిమాలపై జోరు పెంచారు. ఈ క్రమంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. బిల్లా మూవీ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చిరుకి జోడీగా మిల్కీ బ్యూటి తమన్నా నటించనుండగా.. మహానటి కీర్తి సురేష్ చెల్లెలుగా కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ అజిత్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ అని వార్తలు వస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మేకర్స్.

భోళా శంకర్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో అప్డేట్ ఇస్తూ కొత్త పోస్టర్ వదిలారు. మే 1.. కార్మికుల దినోత్సవం సందర్భంగా చిరంజీవికి సంబంధించిన మూడు ఫొటోలు రిలీజ్ చేశారు మేకర్స్. "కార్మికులకు, శ్రమ జీవులకు అందరికీ మే డే శుభాకాంక్షలు" అంటూ ఈ పోస్టర్స్ వదిలారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టాక్సీ డ్రైవర్ గా కనిపించారు. కోల్ కతా బ్యాక్ డ్రాప్ ని సూచిస్తూ బ్లూ యూనిఫాంలో ఉన్న చిరంజీవి స్టైలిష్ లుక్ నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఇక భోళా శంకర్ మూవీ షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. దీంతో ఈ సినిమాను అనుకున్నట్లుగానే ఆగస్టు 11కి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర సమర్పణలో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మా సంగీతం అందించగా, డూడ్లీ సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు.
ఈ సినిమాలో రావు రమేష్, మురళి శర్మ, రవి శంకర్, రఘు బాబు, వెన్నెల కిశోర్, శ్రీముఖి, బిత్తిరి సత్తి, ప్రగతి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు నటిస్తున్నారు. వాల్తేరు వీర్యయ సినిమా తర్వాత వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











