స్టైలిష్ లుక్ లో చిరంజీవి... భోళా శంకర్ టైం స్టార్ట్స్
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి ఇప్పుడు 'భోళా శంకర్' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'భోళా శంకర్' సినిమాకు సంబంధించిన టీజర్ అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. ఆ వివరాల్లోకి వెళితే...
స్టైలిష్ ఫిల్మ్ మేకర్ తో చిరు మూవీ: బిల్లా, శక్తి వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మెహర్ రమేష్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో వస్తున్న మొట్ట మొదటి సినిమా 'భోళా శంకర్'. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సినిమాని తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్చి రీమేక్ చేస్తున్నారు. తమిళంలో అజిత్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ గా నిలవడమే కాదు... కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది.

అభిమానులకు భోళా శంకర్ గిఫ్ట్: ఇక ఈ సినిమాని ఆగస్టు నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేసింది చిత్ర యూనిట్. సినిమాలో మొదటి పాట విడుదల చేయగా... ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకోవడమే కాదు... భోళా మ్యూజిక్ మానియా కూడా మొదలైంది.
అంతకు ముందే చిరంజీవి లీక్ చేసిన సంగీత్ సాంగ్ విజువల్స్ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేయడంతో హిట్ అందుకుంటామని నమ్మకంతో ఉంది సినిమా యూనిట్. సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి పోస్టర్ ఆడియన్స్, అభిమానుల్లో సినిమాపై హైప్ పెంచేయగా.ఇప్పుడు భోళా శంకర్ నుంచి మరో గిఫ్ట్ కూడా రెడీ అయ్యింది.

చిరు స్టైల్ అదరహో: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోళా శంకర్' టీజర్ జూన్ 24న రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ప్రకటన చేస్తూ రీలీజ్ చేసిన చిరంజీవి కొత్త స్టైల్ కూడా సూపర్ ఉంది. బ్లాక్ జీన్స్, బ్లాక్ టీ షర్ట్ మీద చెక్ షర్ట్ వేసిన మెగాస్టార్ సీరియస్ వాకింగ్ స్టైల్, ఫ్యాన్స్ కి మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది.

భోళా శంకరుడి కోసం వెయిటింగ్: ఇక ఆల్రెడీ రిలీజ్ చేసిన ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ యూట్యూబ్, ఆడియో ప్లాట్‌ఫార్మ్స్‌లో ట్రెండ్ అవ్వడమే కాదు, సినిమాపై అంచనాలు పెంచగా మెగాస్టార్ డ్యాన్స్, గ్రేస్ కి తగ్గట్టు మహతి స్వర సాగర్ ఎనర్జిటిక్ డ్యాన్స్ ట్యూన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రిలీజ్ కాబోతున్న టీజర్ కోసం మెగా ఫ్యాన్స్ సహా కామన్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.

శరవేగంగా షూటింగ్ పూర్తి: మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ పాత్రలో కనిపించనున్నారు, కీర్తి ప్రియుడి పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











