మెగా అభిమానుల పండుగ రోజు మెగాస్టార్ పుట్టినరోజు.. సినీ ప్రముఖుల నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలు
టాలీవుడ్ చిత్ర సీమలో చిరంజీవి స్థానం ప్రత్యేకమైనది. అంచెలంచెలుగా ఎదుగుతూ అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్న ఆయన మెగాస్టార్ గా తెలుగు సినీ పరిశ్రమలో రారాజుగా వెలిగిపోతున్నారు. సినీ పరిశ్రమలోని ప్రతీ వ్యక్తితో కలివిడా ఉండే ఆయన తన అభిమాన వర్గాలంటే ఎంతో ఆదరిస్తారు. అందుకే ప్రతీ ఏడాది చిరంజీవి పుట్టిన రోజును పండుగలా చేసుకుంటారు అందరూ. ఈ నేపథ్యంలోనే ఈ రోజు (ఆగస్టు 22 - 2019) మెగాస్టార్ తన 64 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయన పలువురు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. అందులో కొన్ని మీ కోసం..
చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పవన్ కళ్యాణ్, ఫ్యాన్స్ సందడి (ఫోటో గ్యాలరీ)
పవన్ కళ్యాణ్ ప్రత్యేక విషెష్: స్ఫూర్తిప్రదాత చిరంజీవి
స్ఫూర్తిప్రదాత చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొంటూ ఓ విలువైన సందేశాన్ని లెటర్ రూపంలో పోస్ట్ చేశారు పవన్. ఇందులో చిరంజీవి జీవన విలువలను, ఆయన ప్రస్థానాన్ని వివరిస్తూ ఆయన తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరం అని పేర్కొన్నారు.
అంతం లేని ప్రేరణ అంటూ కూతురు సుష్మిత కొణిదెల..
''నా హీరో, నా కాన్ఫిడెంట్, నా గురువు అన్నీ నా ప్రియమైన నాన్నగారే. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పటికీ అంతం లేని ప్రేరణ లాంటి వారు! లవ్ యు నాన్న!'' అని చిరు కూతురు సుష్మిత కొణిదెల ట్వీట్ చేసింది.
అల్లు అర్జున్ ట్వీట్.. సైరా టు.. మన నరసింహా రెడ్డి
మెగాస్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నా జీవితంలో సినీ నటుడిగానే కాదు, మానవుడిగా కూడా ఆయన చాలా గొప్ప వ్యక్తి. నేను చూసిన అత్యంత వినయపూర్వకమైన వ్యక్తి ఆయనే. ఆయన నుండి చాలా పాఠాలు నేర్చుకున్నాను.. ఇప్పటికీ నేర్చుకుంటున్నాను. సైరా టు.. మన నరసింహా రెడ్డి.
నాతో సహా లక్షలాది మందికి ప్రేరణ.. రామ్ చరణ్
మీరు నాతో సహా లక్షలాది మందికి ప్రేరణ, అంతేకాదు గురువు మరియు మార్గదర్శి కూడా. అందరూ మిమ్మల్ని #MEGASTAR అని పిలుస్తారు కానీ నేను మిమ్మల్ని అప్పా అని పిలుస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు అప్పా. మా అందరికీ ఇలాగే స్ఫూర్తినిస్తూ ఉండాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా.
మా ఏకైక మెగాస్టార్ చిరంజీవి.. మంచు మనోజ్
మా ఏకైక మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు! మీ చెయి ఇంకా రఫ్ గానే ఉంది. 'సైరా' తో మళ్ళీ రఫ్ఫాడించేయండి.
మీరు ఆనందానికి చిహ్నం.. హీరోయిన్ రాధిక
హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి. మీరు ఆనందానికి చిహ్నం. దానికి సరైన అర్హత గలవారు. ఎన్నో మంచి లక్షణాలున్న గొప్ప వ్యక్తి మీరు.
నా ప్రియాతిప్రియమైన ఒక్కరు చిరు.. దేవి శ్రీ ప్రసాద్
నా ప్రియాతిప్రియమైన ఒక్కరు చిరంజీవి. మెగాస్టార్ అన్నయ్య గారికి సూప్ డూపర్ మ్యూజికల్ హ్యాపీ బర్త్ డే.
బండ్ల గణేష్ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డి
ఆయన తెలుగు సినిమాకి తిరుగులేని రాజు. మెగాస్టార్‌తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాం. స్క్రీన్ ఉనికిలో అతని వ్యక్తిత్వం సరిపోలలేదు. చిరంజీవి గారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా.
వెన్నెల కిషోర్ ట్వీట్
మనందరి ప్రియమైన వ్యక్తి చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే చిరంజీవి గారు.
చాలా మందికి స్ఫూర్తిదాయకం.. గోపీచంద్ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. సినిమా పట్ల ఆయన కృషి, అంకితభావం చాలా మందికి స్ఫూర్తిదాయకం. సైరా లో మెగాస్టార్ చరిష్మాను చూడటానికి చూడాలని ఆతృతగా ఉంది.


Click it and Unblock the Notifications











