ప్రధానికి చిరు విషెస్.. మై ఫ్రెండ్ అంటూ మోదీ రిప్లై
భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజు నేడు (సెప్టెంబర్ 17). ఇక ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా దేశం నలుమూలల నుంచి విషెస్ వెల్లువెత్తాయి. సినీ రాజకీయ వ్యాపార రంగాల్లోని ప్రముఖులంతా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక సాధారణ ప్రజలు, నెటిజన్లు సైతం ప్రధానికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక ప్రధానికి విషెస్ చెప్పిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున పలకరిస్తూ రిప్లై ఇస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి చెప్పిన విషెస్‌కు, చేసిన ట్వీట్‌కు ప్రధాని రిప్లై ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ... మన ప్రియతమ నేత నరేంద్ర మోదీకి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇంకా చాలా ఏళ్లు దేశానికి సేవ చేసేలా ఆ శక్తి మిమ్మల్ని ముందుకు నడిపించాలి అని కోరుకున్నాడు. ఇక చిరంజీవి చేప్పిన విషెస్‌కు మోదీ స్పందించారు. శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు మై ఫ్రెండ్ చిరంజీవి గారు.. మీరంతా బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

ఇక మోదీ ఇచ్చిన రిప్లైకి చిరంజీవి స్పందించారు. బాగానే ఉన్నాను.. మీ దయాగుణానికి థాంక్యూ మోదీ గారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోంచి మన దేశాన్ని బయటకు తీసుకురావాలి.. ప్రజలను కాపాడాలి.. అందుకు తగిన బలం మీకు చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక చిరంజీవికి మోది ఇచ్చిన రిప్లై.. మోది రిప్లైకి చిరు స్పందించిన తీరు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. మరో వైపు మహేష్ బాబుకు సైతం ప్రధాని రిప్లై ఇచ్చారు.


Click it and Unblock the Notifications











