16 కోట్లతో ప్రాపర్టీ కొనేసిన మెగాస్టార్.. అంత ఖర్చు వెనుక సీక్రెట్ అదేనట!
తెలుగు సినిమా ఇన్నేళ్ళలో దాదాపు నలబై ఏళ్ళు ఒక్క హీరో ఏక ఛత్రాధిపత్యంతో దూసుకెళ్లడం అనేది ఒకే ఒక్క హీరోకి సాధ్యం అయ్యిందని చెప్పాలి. మరి ఆ హీరో ఎవరో కూడా మెగాస్టార్ చిరంజీవినే.. కాగా ఎన్నో ఏళ్ళు తెలుగు సినిమా దగ్గర నెంబర్ 1 స్థానంలో కొనసాగి బ్రేక్ ఇచ్చినప్పటికీ మళ్ళీ తాను వస్తే తన సాటి లేదని టాలీవుడ్ లో ప్రూవ్ చేసుకున్నారు.
ఇలా ఇప్పటికీ ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాస్తున్న చిరంజీవి ఇంత ఏజ్ లో కూడా ఫ్యాన్స్ ని అలరించే ప్రయత్నంలో అలసట లేకుండా శ్రమిస్తున్నారు. కాగా రీసెంట్ గానే గిన్నిస్ వరల్డ్ రికార్డు, ఐపా లో ఓ అవార్డు ఇలా ఒక పక్క రికార్డులు మరో పక్క అవార్డులతో దూసుకెళ్తున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తుంది.

చిరు తనకున్న దానిలో ఎంతోమందికి దాన ధర్మాలు చేశారు. అలాగే ఇంకోపక్క చిరు మంచి లగ్జరీ లైఫ్ ని కూడా లీడ్ చేస్తున్నారు. ఇలా ఇండియాలో రోల్స్ రాయ్స్ ఉన్న అతి తక్కువమందిలో ఒకరుగా కూడా నిలిచారు. కానీ ఈసారి మెగాస్టార్ ఏకంగా 16 కోట్లు పెట్టి ఓ చోట ప్రాపర్టీ కొనేశారట.. కాగా ఇది కూడా ఎక్కడో కాదు మన దేశంలో మంచి టూరిజం స్పాట్ అయినటువంటి ఊటీలో అట.
అక్కడ మెగాస్టార్ ఏకంగా 16 కోట్లు వెచ్చించి 6 ఎకరాల స్థలాన్ని కొన్నట్టుగా ఇపుడు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే అంత ఖర్చు పెట్టి అక్కడే ఎందుకు అంటే దీనికి గట్టి కారణమే ఉందట. తాను కొన్న స్థలం నుంచి ఊటీలో మంచి హిల్ పాయింట్ కనిపిస్తుందట. మనసుకి ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపించేలా స్పాట్ ని చిరు సెలెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఒక ఫార్మ్ హౌస్ ని కట్టకోనున్నారట.
అందుకే అంత పెట్టి కొనుగోలు చేసినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ ఇపుడు తన కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా దర్శకుడు వసిష్ఠతో "విశ్వంభర" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది భారీ విజువల్స్ తో కూడా వండర్ డ్రామాగా ప్లాన్ చేస్తుండగా చిరు చేసిన సైరా నరసింహా రెడ్డి తర్వాత ఇదే అత్యధిక బడ్జెట్ తో నిర్మాణం వహించబడుతుంది అని తెలుస్తుంది.

కాగా ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా త్రిష మెగాస్టార్ చిరంజీవి సరసన మళ్ళీ స్టాలిన్ సినిమా తర్వాత జోడిగా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరో యంగ్ బ్యూటీ ఆశికా రంగనాథ్ కూడా కీలక పాత్ర చేస్తుండగా మరో హీరోయిన్ రఘువరన్ బి టెక్ ఫేమ్ సురభి పురానిక్ కూడా నటిస్తుంది. అలాగే ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











