శ్రీదేవిపై సందీప్ రెడ్డి వంగ ప్రశ్న.. మెగాస్టార్ ధీటైనా సమాధానం
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ లో అలనాటి హీరోలకు ధీటుగా సినిమాలు చేశారు. వారి స్ఫూర్తితో టాలీవుడ్ లో సంచలనంగా మారిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో చిరంజీవి ఎంట్రీ తర్వాత ఎన్నో మార్పులు జరిగాయి. 150కి పైగా సినిమాలు చేసిన మెగాస్టార్ ఎన్నో గుర్తుండిపోయే సినిమాల్లో నటించి మెప్పించారు. వాటిల్లో చిరంజీవి - శ్రీదేవీ జంటగా నటించిన ఎవర్ గ్రీన్ ఫిల్మ్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రం ఇప్పుడు రీ రిలీజ్ కాబోతుండటం విశేషం. ఈ సందర్బంగా ప్రత్యేకమైన ప్రెస్ మీట్ నిర్వహించారు. కాగా, సందీప్ రెడ్డి వంగ శ్రీదేవిని ఉద్దేశిస్తూ మెగాస్టార్ ను ఆసక్తికరమైన ప్రశ్నను అడిగారు. అందుకు చిరంజీవి ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది..
జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్..
మెగాస్టార్ చిరంజీవి కెరీయర్ లోనే ఉత్తమమైన చిత్రం, టాలీవుడ్ ఎవర్ గ్రీన్ ఫిల్మ్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఈ చిత్రం మెగాస్టార్ కెరీయర్ లో మొదటి ఫాంటాసీ చిత్రం. 1990 మే 9న తెలుగు భాషలో విడుదలైంది. యండమూరి వీరేంద్రనాథ్ కథ అందించారు. సంధ్యాల స్క్రీన్ ప్లే రాశారు. దర్శక దిగ్గజం కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, దివంగత శ్రీదేవి కలిసి నటించారు. వైజయంతి బ్యానర్ పై సీ అశ్వనీ దత్ రూ.2 కోట్లు వెచ్చించి భారీ స్థాయిలో నిర్మించారు. తిరిగి బాక్సాఫీస్ నుంచి రూ.15 కోట్లు రాబట్టింది. కాగా ఈ చిత్రం మే9న థియేటర్లలో రీరిలీజజ్ కాబోతోంది.

చిరంజీవికి సందీప్ రెడ్డి వంగ టఫ్ క్వశ్చన్
చిరంజీవికి టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ టఫ్ క్వశ్చన్ అడిగారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం రీ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. సందీప్ రెడ్డి వంగ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు... జగదేక వీరుడు చిత్రంలో శ్రీదేవికి కూడా మీ పాత్రకు సమానంగా ప్రాధాన్యత ఇచ్చారు.. టైటిల్ లో కూడా శ్రీదేవికి సగభాగం అందించారు. అయితే ఆ చిత్రంలో శ్రీదేవి పాత్ర ముఖ్యమైనదని భావిస్తున్నారా? శ్రీదేవి ముఖ్యమా? కాదా అని ప్రశ్నించారు.
చిరు ధీటైనా బదులు..
దీంతో చిరంజీవి ఆసక్తికరంగా బదులిస్తారు. ఆ చిత్రంలో శ్రీదేవి పాత్ర ఎంతో ముఖ్యమైనది. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి కావాలంటే నేను కాకపోతే మరో జగదేక వీరుడు దొరికే అవకాశం ఉంటుంది కానీ, అతిలోక సుందరి అనే పాత్రకు మాత్రం శ్రీదేవి తప్ప భూమ్మిద ఎవరూ సరిపోరారని అన్నారు. ఆమె 'అతిలోక సుందరి'గా బిరుదు పొందేందుకే పుట్టిందని చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి తనను తగ్గించుకొని శ్రీదేవిని పొగడంతో ఆమె అభిమానులు ఎంతగానో ఖుషీ అవుతున్నారు.
చిరంజీవి రాబోయే చిత్రాలు..
వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ వంటి చిత్రాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'. ఈ చిత్రానికి వశిష్ఠ మల్దిడి దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా157 త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో వైలెంట్ చిత్రం కూడా రూపు దిద్దుకోనుంది.


Click it and Unblock the Notifications











