Klin Kaara మనువరాలితో కలిసి విఘ్నేశ్వరుడికి చిరంజీవి పూజలు.. క్లింకారకు వేద పండితుల ఘన స్వాగతం!

దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను మెగా ఫ్యామిలీ ప్రతీ ఏడాది భక్తి శ్రద్దలతో జరుపుకోవడం తెలిసిందే. అయితే ప్రతీసారి మాదిరిగానే ఈ ఏడాది కూడా తన కుటుంబంతో కలిసి గణేస్ చతుర్థి పండుగను జరుకొన్నారు. కానీ ఈ ఏడాది తన మనవరాలు క్లింకారతో కలిసి జరుపుకోవడం ప్రత్యేకంగా మారింది. మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీలో జరిగిన వినాయక చవితి పండుగ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఈ ఫోటోల వివరాల్లోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవి తన ఇంటిలో భారీ మట్టి వినాయకుడిని నెలకొల్పాడు. వినాయకుడికి పూజుల జరిపించి.. పండ్లు, పూలు సమర్పించారు. ధూపదీప నైవాద్యాలను సమర్పించుకొన్నారు. వినాయకుడి చుట్టు అరటి ఆకులతో బిల్వ పత్రాలను భక్తితో సమర్పించారు.

 Klin Kaara

చిరంజీవి ఇంటిలో జరిగిన పూజలో చిరంజీవి కూతుళ్లు, వారి పిల్లలతోపాటు రాంచరణ్, ఉపాసన కొణిదెల హాజరయ్యారు. రాంచరణ్ దంపతులు తమ కూతురు కింకారతో కలిసి కనిపించారు. ఉపాసాన ఒడిలో ఉన్న రాంచరణ్ కూతురు క్లింకారను చూస్తూ చిరంజీవి సంతోషంలో మునిగిపోయారు. ఏ ఏడాది పూజలో క్లింకార ఇంటిలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారిపోయినట్టు చిరంజీవి ఫ్యామిలీ ముఖాల్లో కనిపించిన ఆనందం చెప్పకనే చెప్పింది.

 Klin Kaara

క్లింకార విషయానికి వస్తే.. గత మూడు నెలలుగా తాత, అమ్మమ్మ శోభన, అనిల్ కామినేని ఇంటిలో గడిపి పండుగ రోజున మెగాస్టార్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని క్లింకారకు వేద పండితులతో స్వాగతం పలికారు. రాంచరణ్, ఉపాసన, క్లింకారకు చిన్న జీయర్ స్వామి వారి ఆశ్రమం నుంచి వచ్చిన వేద పండితులు స్వాగతం పలికారు.

 Klin Kaara

వినాయక చవితి పూజ అనంతరం చిరంజీవి, రాంచరణ్ తమ కుటుంబ సభ్యులతో ఫోటోకు ఫోజిచ్చారు ఈ పూజలో చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవీ కూడా ఉండటం విశేషంగా కనిపించింది. చిరంజీవి కుటుంబ సభ్యులు భక్తిభావంతో జరుపుకొన్న ఈ పండుగ అభిమానులకు కూడా పండుగ వాతావరణం తెచ్చిపెట్టింది.

చిరంజీవి కెరీర్ విషయానికి వస్తే.. ఈ ఏడాది మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం భారీ విజయం సాధించింది. ఇటీవల ఆయన నటించిన భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పొందింది. ప్రస్తుతం బింబిసార దర్శకుడి రూపొందించే సినిమా కోసం చిరంజీవి సిద్దమవుతున్నారు.

 Klin Kaara

రాంచరణ్ కెరీర్ విషయానికి వస్తే.. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ సినిమా అనంతరం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం రాంచరణ్ రెడీ అవుతున్నారు. ప్రస్తుతం తన కూతురితో కలిసి సమాయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X