HBD Chiranjeevi:చిరంజీవి 69వ పుట్టిన రోజు.. మెగాస్టార్ బర్త్ డే ఎక్కడ జరుపుకొంటున్నారో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం అంటే అభిమానులు పండగ రోజుగానే భావిస్తారు. ఆయన పుట్టిన రోజు వచ్చిందంటే.. ఫ్యాన్ప్ పలుచోట రకరకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. గత కొన్నేళ్లుగా ఆయన అభిమానులు సామాజిక సేవలో నిర్విరామంగా పాల్గొంటున్నారు. ఆగస్టు 22వ తేదీ అంటే సినీ అభిమానులుకు ఓ ప్రత్యేకమైన రోజు. ఆ రోజున చిరంజీవి కంటే ఎక్కువగా ఫ్యాన్సే బర్త్ డేను సెలబ్రేట్ చేస్తుంటారు. అయితే ఈ సారి చిరంజీవి ఎక్కడ పుట్టిన రోజున జరుపుకొంటున్నారంటే..

కొణిదెల శివశంకర వరప్రసాద రావుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో అంజనా దేవీ, వెంకట్రావు దంపతుల సంతానంగా ఆగస్టు 22వ తేదీన జన్మించారు. 1955 సంవత్సరంలో జన్మించిన ఆయన తన 69వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు.

Chiranjeevi celebrating 69th birthday at Tirumala with Blesses of Balaji

ప్రతీ ఏడాది అభిమానులకు, స్నేహితులకు, సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండి తన జన్మదినాన్ని పర్వదినంగా జరుపుకొంటారు. ఈ సంవత్సరం ఆయన కాస్త అభిమానులకు దూరంగా ఉండి.. దైవ సన్నిధానంలో పుట్టిన రోజును గడపనున్నారు.

చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి జన్మదినాన్ని తిరుమలలో జరుపుకోనున్నారు. చిరంజీవి ఆగస్టు 21న సాయంత్రం తిరుమల చేరుకొంటారు. తన పుట్టిన రోజు సందర్బంగా కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆగస్టు 22వ తేదీ ఉదయం తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవలలో పాల్గొంటారు. వేద పండితుల ఆశీర్వచనం అందుకొంటారు అని తెలిపారు.

Chiranjeevi celebrating 69th birthday at Tirumala with Blesses of Balaji

ఇదిలా ఉండగా, చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో త్రిషా కృష్ణన్, మీనాక్షి చౌదరీ, ఆశికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంవత్సరం జనవరి 10వ తేదీన రిలీజ్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X