చిరంజీవి ముఖ్య అతిథిగా ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని తేలిపోయింది. సినిమా విడుదలైన రెండో రోజు డిస్ట్రిబ్యూటర్స్ 100 శాతం తమ పెట్టుబడి రికవరీ చేసుకున్నారు. దీంతో ఈ నెల 19న బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఇందుకు వేదిక కాబోతోంది.
ఈ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. అభిమానులు భారీగా తరలిరాబోతున్న నేపథ్యంలో గ్రాండ్‌గా ఈ వేడుక జరుగబోతోంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ రాకతో బ్లాక్‌బస్టర్ వేడుకకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు.

'గీత గోవిందం' తొలి రోజు రూ. 16 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజుతో రూ. 25 కోట్ల మార్కును దాటేసింది. నైజాం ఏరియాలో ఆడియన్స్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో 50 స్క్రీన్లను అదనంగా యాడ్ చేశారంటే సినిమాకు ఎంత డిమాండ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.
'గీత గోవిందం' థియేట్రికల్ రైట్స్ రూ. 15 కోట్లకు అమ్మారు. రెండు రోజుల్లోనే రూ. 15.70 కోట్ల షేర్ రాబట్టడంతో..... 100 శాతం ఇన్వెస్ట్మెంట్ రావడంతో పాటు సినిమా లాభాల బాట పట్టినట్లయింది.
శుక్రవారం తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ సెలవు ప్రకటించడం, శని, ఆదివారాలు హాలిడే కావడంతో ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి కలెక్షన్స్ రూ. 50 కోట్ల మార్కు ఈజీగా అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











