పాలిటిక్స్ రీ ఎంట్రీపై చిరంజీవి క్లారిటీ.. పవన్ కల్యాణ్‌పై ఆ బాధ్యత అంటూ కామెంట్
స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అభిరుచి గల నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన చిత్రం బ్రహ్మఆనందం. ఈ సినిమాకు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రఘు బాబు, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, దివిజా ప్రభాకర్, ఈటీవీ ప్రభాకర్, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
నాగ అశ్విన్ త్వరగా సినిమా ఫినిష్ చేయాలి. టైమ్ వేస్ట్ చేయకండి. వెంటనే సినిమా పూర్తి చేస్తే నా గురించి ఆలోచిస్తావని అనుకొంటున్నాను. యంగ్ డైరెక్టర్స్‌తో పనిచేయాలని ఉంది. వారితో పనిచేస్తే ఉత్సాహంగా ఉంటుంది. నా జన్మంతా ఇక సినిమా రంగానికే. చాలా మందికి నా గురించి రకరకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి. అలాంటి ఉద్దేశం నాకు లేదు అని చిరంజీవి అన్నారు.

చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్తారేమో అనే డౌట్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద వాళ్లకు దగ్గర అవుతున్నారు. వారందరూ ఆయనను దగ్గర చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాకు వీలైనంత మేరకు సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మీడియా ఫ్రెండ్స్‌కు ఉన్న సందేహాలకు నేను క్లారిటీ ఇస్తున్నాను అని చిరంజీవి చెప్పేశారు.
నేను పొలిటికల్‌గా ముందుకు వెళ్లడానికి, నేను అనుకొన్న లక్ష్యాలను, నేను అనుకొన్న సేవా భావాలను, సేవలను పూర్తి చేయడానికి నా సోదరుడు పవన్ కల్యాణ్ ఉన్నాడు. నా కలలను ఆయన నేరవేరుస్తారనే ప్రగాఢ నమ్మకం ఉంది అని చిరంజీవి అన్నారు. అలాగే బ్రహ్మఆనందం సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అవుతుంది. బ్రహ్మానందం కుమారుడిని అక్కున చేర్చుకొండి. ఆశీస్సులు ఇవ్వండి. బిడ్డకు మంచి భవిష్యత్ ఏర్పడుతుంది. తండ్రికి పుత్సోత్సాహం కలుగుతుంది అని చిరంజీవి అన్నారు.
బ్రహ్మాఆనందం సినిమాకు ప్రోత్సాహించండి. ఈ వేడుకలో పాలు పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన బ్రహ్మానందంకు నా థ్యాంక్స్. బ్రహ్మానందం ఎవరో కాదు. నా సోల్‌మేట్. బ్రహ్మానందాన్ని ప్రేమించిన సందర్బాలు, ఏడిపించిన సందర్భాలు, కోపగించుకొన్న సందర్బాలు ఉన్నాయి. వయసులో ఆయన కంటే తక్కువ వయసే. నన్ను పెద్దగా చూస్తుంటాడు. మంచి వెల్‌కమ్ నేచర్ ఉన్న వ్యక్తి. ఆయన మనసులో చాలా పెట్టుకొన్నాడు. అందుకే ఆయనను ఏమైనా అనే స్వతంత్రం నాకు ఉంది. మన మధ్య ఆ ప్రేమ ఇలాగే కొనసాగాలి అని చిరంజీవి అన్నారు.

బ్రహ్మఆనందం సినిమా విజయం సాధించడం ద్వారా ప్రుత్సోత్సాహం కలుగుతుంది. నేను ఎంతగా పుత్పోత్సాహం అనుభవిస్తున్నానో.. అంతకంటే ఎక్కువగా దానిని మీరు ఆస్వాదిస్తారు. మనం ఎంత సంపాదించాం. బ్యాంకులో ఎన్ని కోట్లు డిపాజిట్స్ చేసుకొన్నాం. ఎంత ల్యాండ్ మన పేరు మీద ఉందనేది కాదు. మనకు పుత్సోత్సాహం ఇచ్చే సంపదనే గొప్పది. బిడ్డలు సరైన మార్గంలో లేకపోతే ఎంత బాధ ఉంటుందో చెప్పలేం అని చిరంజీవి అన్నారు.


Click it and Unblock the Notifications











