చిరంజీవి నుంచి ఊహించని ట్రీట్.. పంచింగ్ ఫలక్‌నామాలకే పంచ్‌లు
ఆరు పదుల వయసులోనూ కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోనని నిరూపించుకునేలా వేగంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా రీఎంట్రీలో దుమ్ము రేపుతోన్న ఆయన.. వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. దీనికితోడు గత సంక్రాంతికి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' అనే మూవీతో వచ్చేశారు. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్పందన సొంతమైంది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు భారీగా దక్కాయి. ఫలితంగా ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించి ఎన్నో రికార్డులను కొట్టేసింది.
వాస్తవానికి 'వాల్తేరు వీరయ్య' కంటే ముందే చిరంజీవి 'భోళా శంకర్' మూవీని స్టార్ట్ చేశారు. దీన్ని మెహర్ రమేశ్ రూపొందిస్తుండడంతో ఆరంభంలోనే ఈ చిత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఆయన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

ఇక, ఈ మూవీ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. ఇక, ఇటీవలే ఈ మూవీ డబ్బింగ్ వర్క్ కూడా ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.
'భోళా శంకర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే కామెడీతో అలరించబోతున్నారట. అంతేకాదు, ఆయనతో పాటు వెన్నెల కిశోర్, హైపర్ ఆది, సత్యలు ఒక గ్యాంగ్‌గా ఉంటారని తెలిసింది. వీళ్లతో కలిసి ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదట.

ముఖ్యంగా పంచింగ్ ఫలక్‌నామాలుగా పేరొందిన ఈ ముగ్గురు యంగ్ కమెడియన్లపై చిరంజీవి పంచులతో దాడి చేస్తారని సమాచారం. ఫస్టాఫ్‌లో వచ్చే ఈ కామెడీ సీన్స్ అన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. ఈ మూవీలో ఈ సన్నివేశాలు హైలైట్ కాబోతున్నాయని టాక్.
ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'భోళా శంకర్' మూవీలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే, తమన్నా భాటియా, సుశాంత్ కీల పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











