చెగువేర అంటూనే పవన్ పేరెత్తిన చిరంజీవి.. కేకలు పెట్టించిన మెగాస్టార్

చెగువేర.. ఈ పేరు వింటేనే యూత్ అంతా కేకలు పెడతారు. ముఖ్యంగా పవన్ అభిమానులు చెగువేరా పేరు వింటేనే ఉగిపోతుంటారు. మరోవైపు పవన్ కూడా తనకు చెగువేర వీరత్వం అంటే ఎంతో ఇష్టమని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. సో అలా అలా మెగా ఫ్యాన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యాడు చెగువేర. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ చెగువేరతో పాటు పవన్ పేరు ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల్లోకి పోతే..

అర్జున్ సురవరం మూవీ

అర్జున్ సురవరం మూవీ

నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన మూవీ 'అర్జున్ సురవరం'. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. చిత్రానికి టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహించగా, ‘ఠాగూర్' మ‌ధు స‌మ‌ర్పణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రాజ్‌ కుమార్ ఆకెళ్ల నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆకర్షించిన చిరంజీవి స్పీచ్

ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆకర్షించిన చిరంజీవి స్పీచ్

ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 'అర్జున్ సురవరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వేదికపై అందరినీ ఆకర్షిస్తూ తనదైన స్టైల్‌లో మాట్లాడారు మెగాస్టార్. ముఖ్యంగా ఆయన చెగువేర అంటూ పవన్ పేరెత్తిన సమయంలో వేదిక అంతా హోరెత్తిపోయింది.

తన మాటలతో వేదికలో కేకలు పెట్టించిన చిరు

తన మాటలతో వేదికలో కేకలు పెట్టించిన చిరు

'అర్జున్ సురవరం' సినిమాలో చెగువేరకు సంబంధించిన ఓ పాట ఉంది. ఈ పాట గురించి మాట్లాడిన చిరంజీవి.. ఈ సాంగ్ అద్భుతంగా వచ్చిందని కితాబిచ్చారు. ఆ పాటను తన ఫేవరెట్‌ సింగర్‌ శంకర్‌ మహదేవన్‌ పాడారని చెప్పారు. ఆ సాంగ్ చూస్తున్నంత సేపు, అలాగే ఆ చెగువేర ఇమేజ్‌ చూస్తున్నంత సేపు నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా..? అంటూ వేదికలో కేకలు పెట్టించారు చిరంజీవి.

Recommended Video

#CineBox : Fans Begin Countdown For RRR,With #250daystomassiveRRR
నా తమ్ముడు పవన్‌ అంటూ చిరంజీవి కామెంట్స్

నా తమ్ముడు పవన్‌ అంటూ చిరంజీవి కామెంట్స్

దీంతో చిరంజీవి మాటలకు రియాక్ట్ అయిన మెగా అభిమానులు ఒక్కసారిగా పవన్‌, పవన్‌ అంటూ కేకలు పెట్టారు. అప్పుడు చిరంజీవి కూడా వారిలో మరింత ఉత్సవాహం నింపుతూ పవన్‌ మేనరిజంను ఇమిటేట్‌ చేస్తూ మెడ మీద తన చేతితో రుద్దడం కిక్కిచ్చింది. చెగువేర అనగానే నా బ్రదర్‌, నా తమ్ముడు పవన్‌ కళ్యాణ్ గుర్తొస్తున్నాడని చిరంజీవి అనడంతో ఆ వేదిక కేకలతో దద్దరిల్లిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X