Chiranjeevi: మళ్లీ డైరెక్టర్లకు చిరంజీవి చురకలు.. అది నేర్చుకోవాలంటూ కామెంట్స్!
తెలుగు చిత్ర సీమలో ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుల్లో కళాతపస్వీ కే విశ్వనాథ్ ఒకరు. స్వయంకృషి, సప్తపది, శృతిలయలు, శుభలేఖలు, సాగర సంగమం, శుభ సంకల్పం, శంకరాభరణమం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరపురాని సినిమాలను అందించారు. అయితే ఇటీవల ఆయన మరణంతో సినీ లోకం దిగ్భ్రాంతికి లోనైంది. అలాంటి గొప్ప దర్శకుడి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు మిగిల్చింది. ఇక ఆయనతో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా కళాతపస్వి విశ్వనాథ్ కళాంజలి పేరుతో ఆయనకు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

సినీ ప్రముఖులు హాజరు..
ఇటీవల లెజండరీ దర్శకులు కళాతపస్వీ కే విశ్వనాథ్ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితోపాటు రాఘవేంద్ర రావు, నిర్మాత విశ్వప్రసాద్, మీన, ఎస్వీ కృష్ణా రెడ్డి, మురళి మోహన్, అలీ, రాధిక, అశ్వనీదత్, ఆమని, రాజశేఖర్, సుమలత, ఆర్ నారాయణ మూర్తి, శేఖర్ కమ్ముల, వైవీఎస్ చౌదరి, వీఎన్ ఆదిత్య, తనికెళ్ల భరణి, జజయసుధ, సుబ్బిరామి రెడ్డి తదితరులతోపాటు కే విశ్వనాథ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఇది సంబరంలా జరుపుకోవాలి..
కే విశ్వనాథ్ సంతాప సభ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. తారకరత్న మరణ వార్త చాలా బాధాకరం అని చెప్పిన తర్వాత "ఇది విశ్వనాథ్ గారి సంతాప సభ అన్నారు. అయితే ఆయన మనకు ఇచ్చిన గొప్ప సినిమాలు ఆయన గొప్పతనం. అంత గొప్ప మనిషితో మనం కలిసి పనిచేసినందుకు. ఇవన్నీ చూసి మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక సంబరంలా జరుపుకోవాలి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారందరికీ నా ధన్యవాదాలు" అని చిరంజీవి తెలిపారు.

గురువులా వ్యవహరించారు..
"నేను విశ్వనాథ్ గారిని మూడు కోణాల్లో చూస్తాను నాకు మూడు సినిమాల్లో అవకాశం ఇచ్చి, అద్భుతమైన క్యారెక్టర్స్ ఇచ్చి నాకు అవార్డులు వచ్చేలా నటనను రాబట్టిన దర్శకుడిగా, ఆయన నా నటనను అనుక్షణం సరిదిద్దుతూ, నటనలో మెళకువలు నాకు చెబుతూ, హావాబావాలను ఎలా చేయాలో చెబుతూ ఒక గురువులా వ్యవహరించిన తీరు నాకు ఇప్పటివరకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఆయనతో ఎవరికీ లేని అనుబంధం నాకే ఉందనిపిస్తుంటుంది" అని చిరంజీవి పేర్కొన్నారు.

నన్ను ఓ బిడ్డలా చూశారు..
"ఆయన నాలో ఒక నటుడిగా కాకుండా రాను రాను ఓ బిడ్డలా చూసుకుంటూ.. నేను డైట్ పేరు చెప్పి అన్నం తినకుండా ఉంటే అన్నం పెట్టి చూపించిన ప్రేమలో తండ్రిగా చూస్తాను. ఆయన పెట్టిన పెరుగు అన్నాన్ని శివుడి ప్రసాదంలా ఆ సమయంలో అనుభూతి చెందాను. యాక్షన్ చిత్రాలు చేస్తున్న సమయంలో ఆయనతో నాకు శుభలేఖ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. ఆయనతో సినిమా అంటే నాలో కంగారు వచ్చేసింది. నా స్పీడ్ నటనను చూసి అంత కంగారు పడుతున్నావు అంటూ నిదానం చేసి నా నటనలో నెమ్మదిని తీసుకొచ్చారు" అని చిరు వెల్లడించారు.

ఫుల్ యాక్షన్ హీరోగా..
నేను ఒకసారి సెట్ లో సరదాగా ఉంటే బెత్తం పట్టుకుని తిరుగుతుంటే అదే డ్యాన్స్ అంటూ నాతో సొంతంగా డ్యాన్స్ చేయించేలా చేశారు. నిజం చెప్పాలి అంటే నాకు అసలు క్లాసికల్ డ్యాన్స గురించి తెలియదు. కానీ ఆయన నాతో భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథకాళి చేయించారు. క్లాసికల్ డ్యాన్స్ చేయగలను అని నమ్మకం ఇచ్చారు. నేను ఫుల్ యాక్షన్ హీరోగా ఉన్నప్పుడు నాకు మళ్లీ స్వయంకృషి ఇచ్చారు. తర్వాత మరో అద్భుతమైన ఆపద్భాందవుడు ఇచ్చారు అని పేర్కొన్నారు చిరంజీవి.

అది నేర్చుకోమంటాను..
"ఇప్పుడు డైరెక్టర్స్ మాత్రం ప్రస్తుతం ఉన్న హీరోలను కెమెరా ముందు ఎటు మూమెంట్ కావాలంటే అటు నడవమని చెప్పి కమెరాను ఒకేచోట పెడుతున్నారు. అయితే విశ్వనాథ్ గారు అలా కాదు. ఆయన హీరోలను ఎలా కావాలంటే అలా చేయమని చెప్పి కెమెరాని ఆయనకు నచ్చినట్లు ఆర్టిస్టులు చుట్టూ తిప్పేవారు. ఇది చెప్పి నేటి డైరెక్టర్స్ ని నేర్చుకోమంటాను" అని చిరు వెల్లడించారు.

కేవలం విశ్వనాథ్ ఒక్కరే..
"విశ్వనాథ్ గారి దగ్గరి నుంచి నేటి తరం డైరెక్టర్స్ చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో క్యారెక్టర్స్ ఏడవటం కాదు ప్రేక్షకులు ఏడవాలి. అలా చేసే దర్శకుడు కే విశ్వనాథ్ ఒక్కరే. నేను అదే అంటాను మేము ఆర్టిస్టులం ఏడిస్తే ప్రేక్షుకులు ఏడుస్తారనుకోకండి. వాళ్లు ఏడవరు. నేను అదే నేటి యంగ్ స్టర్స్ కు చెబుతుంటాను. నేను డైరెక్టర్ ని కాదు. కానీ ఆయన దగ్గరి నుంచి నేర్చుకున్నవి నేటి డైరెక్టర్లకు సజ్జెస్ట్ చేస్తుంటాను" అని చిరంజీవి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











