లావణ్య త్రిపాఠిపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్.. ఆమె రియాక్షన్ చూస్తే..

తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ రారాజుగా కీర్తించబడుతున్న ఆయనను సినీ పరిశ్రమలోని ప్రతీ ఒక్కరూ ఇష్టపడుతుంటారు. ఇక మెగాస్టార్ అభిమాన వర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అలాంటి మహా మనిషి, గొప్ప నటుడు చిరంజీవి.. తాజాగా యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిపై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..

నిఖిల్ సిద్ధార్థతో లావణ్య త్రిపాఠి రొమాన్స్

నిఖిల్ సిద్ధార్థతో లావణ్య త్రిపాఠి రొమాన్స్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘అర్జున్ సురవరం'. ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్ర విడుదల కోసం కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఆలస్యమవుతూ వచ్చింది. చివరకు ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఘనంగా మంగళవారం రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్.

చిరంజీవి మాట్లాడిన తీరు.. అందరికీ ఆశ్చర్యం

చిరంజీవి మాట్లాడిన తీరు.. అందరికీ ఆశ్చర్యం

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా‌లో జరిగిన ఈ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరై సందడి చేశారు. ఈయనతో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అతిథిగా హాజరయ్యారు. దీంతో ఈ వేడుక అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఈ ప్రోగ్రాంలో వేదికపై చిరంజీవి మాట్లాడిన తీరు, లావణ్యపై ఆయన చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి.

లావణ్య త్రిపాఠి అందం గురించి చిరంజీవి

లావణ్య త్రిపాఠి అందం గురించి చిరంజీవి

ముందుగా నిఖిల్ సిద్ధార్థ గురించి మాట్లాడిన చిరంజీవి.. ఆ యంగ్ హీరోపై ప్రశంసలు గుప్పించారు. జర్నలిస్టుగా ఈ సినిమాలో నిఖిల్ అభినయం చాలా బాగుందని చెప్పారు. ప్రేమాభిమానాలే బ్యాంకు బాలన్స్‌గా భావించే తనకు నిఖిల్ అభిమానంతో ఆ బ్యాంకు బాలన్స్ పెరిగిందని అన్నారు చిరు. ఆ తర్వాత హీరోయిన్ లావణ్య గురించి మాట్లాడుతూ ఆమె అందాన్ని తెగ పొగిడేశారు చిరు.

మెగాస్టార్ మాటలు.. లావణ్య త్రిపాఠి రియాక్షన్

మెగాస్టార్ మాటలు.. లావణ్య త్రిపాఠి రియాక్షన్

లావణ్యలో తనకు బాగా నచ్చింది ఆమె సొట్ట బుగ్గలు అని చెప్పారు చిరంజీవి. ఆ సొట్ట బుగ్గలతో ఆమె చేసే క్యూట్ యాక్టింగ్ భలే ఉంటుందని అన్నారు. అలాగే దర్శకుడు మారుతి తెరకెక్కించిన 'భలే భలే మగాడివోయ్' చిత్రంలో ఆమె చాలా బ్యూటిఫుల్‌గా కనిపించిందని చెప్పుకొచ్చారు చిరంజీవి. మెగాస్టార్ ఇలా మాట్లాడుతుంటే అక్కడే ఉన్న లావణ్య తెగ సంబరపడిపోయింది.

Recommended Video

#CineBox : Fans Begin Countdown For RRR,With #250daystomassiveRRR
అర్జున్ సురవరం మూవీ

అర్జున్ సురవరం మూవీ

నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన అర్జున్ సురవరం మూవీలో నిఖిల్ సిద్ధార్థ, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. చిత్రానికి టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహించగా, ‘ఠాగూర్' మ‌ధు స‌మ‌ర్పణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రాజ్‌ కుమార్ ఆకెళ్ల నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X