ఇక నా వల్ల కాదు.. ఆ పని రామ్ చరణ్ చేయాల్సిందే.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్
ఉయ్యలవాడ నరసింహా రెడ్డిగా కనిపించాలని చిరంజీవి కన్న కలలు నిజమయ్యాయి. ఎప్పటి నుంచో చిరంజీవి మదిలో మెదులుతున్న కోరికను తీర్చేశారు రామ్ చరణ్. భారీ ఎత్తున సైరా నరసింహా రెడ్డి సినిమా రూపొందించి తండ్రికి కానుకగా ఇచ్చారు. ఈ రోజే (బుధవారం) విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షక లోకం బ్రహ్మరథం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి పోతే..

ఇక చిరు అలా కనిపించడమే తరువాయి
చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు సైరా నరసింహా రెడ్డి కార్యరూపం దాల్చడంతో.. ఇక చిరు భగత్ సింగ్‌గా కనిపించడమే తరువాయి అని ఫిక్స్ అయ్యారు మెగా అభిమానులు. అయితే ఈ విషయమై ఇటీవలే జరిగిన సైరా ప్రమోషన్స్‌లో భాగంగా స్పందించిన చిరు.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. సైరా గురించి చెబుతూనే భగత్ సింగ్ పాత్రపై తన ఫీలింగ్స్ పంచుకున్నారు.

గొప్ప ఫీలింగ్‌తో బయటకు వస్తారు
థియేటర్‌లో సైరా సినిమా చూసిన ప్రేక్షకులు ఓ గొప్ప ఫీలింగ్‌తో బయటకు వస్తారని తాను నమ్మకంగా ఉన్నట్లు చెప్పారు చిరంజీవి. సైరా ప్రారంభం అయినప్పట్నుంచి తాను చాలా మారిపోయానని, నవ్వడం కూడా మానేశానని అన్నారు. సీరియస్ గా సైరా పనులు పూర్తిచేసి ఈ ప్రాజెక్టును మీ ముందుకు తెస్తున్నానని చెప్పారు చిరంజీవి.

ఇక నా వల్ల కాదు.. రామ్ చరణ్ చేస్తాడు
ఇప్పట్లో మళ్లీ ఇలాంటి పాత్ర చేయలేనని ఈ సందర్బంగా చిరంజీవి పేర్కొనడం గమనార్హం. గతంలో భగత్ సింగ్ క్యారెక్టర్ చేయాలనుకున్నాను కానీ ఇక ఆ పాత్ర చేయలేననే ఫీలింగ్ కలుగుతోంది. భగత్ సింగ్ పాత్రను చరణ్ చేస్తే బాగుంటుందనేది తన అభిప్రాయమని చిరు అన్నారు.

మెగా ఫ్యామిలీ పాటు వాళ్ళు కూడా
ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' భారీ రేంజ్‌లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమాను బ్లాక్ బస్టర్ అని డిసైడ్ చేసేశారు జనం. దీంతో ఇటు మెగా ఫ్యామిలీ, అటు మెగా అభిమానులు ఖుషీ ఖుషీ అవుతున్నారు.
Recommended Video

సైరా నరసింహా రెడ్డి విశేషాలు
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











