నాగచైతన్యపై మెగాస్టార్ కామెంట్స్.. వెంకీమామ చూడగానే చిరంజీవి రెస్పాన్స్
అక్కినేని నాగచైతన్య, విక్టరీ వెంకటేష్ హీరోలుగా రూపొందిన సినిమా 'వెంకీమామ'. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 13న విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు తన రెస్పాన్స్ చెప్పగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
''మా ఫ్యామిలీ అంతా కలిసి 'వెంకీ మామ' సినిమా చూశాం. సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేశాం. మాకు చాలా బాగా నచ్చింది. మామకు తగ్గ అల్లుడిగా నాగచైతన్య కూడా చాలా మెచ్యూర్డ్‌గా పర్ఫామ్ చేశాడు. ఈ సినిమా సక్సెస్‌లో నాగచైతన్య కూడా భాగస్వామి అయ్యాడు. వెంకటేష్ తన స్టైల్ ఆఫ్ కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్స్ సీన్స్‌తో అద్భుతంగా చేశాడు. చాలా కాలం తర్వాత యాక్షన్ సన్నివేశాల్లో కూడా 'వావ్' అనిపించాడు. ఈ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణమైన వెంకటేష్‌ను మనస్పూర్తిగా అభినందిస్తున్నా'' అన్నారు చిరంజీవి.
ఇక ఈ చిత్ర దర్శకుడు బాబీ గురించి మాట్లాడుతూ.. తన స్టైల్‌లో ఈ సినిమాను రసవత్తరంగా నడిపించాడు. ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించినందుకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అంటూ చిరంజీవి తన ఆనందం వ్యక్తం చేశారు.

వెంకీమామ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటించగా.. నాగచైతన్య సరసన రాశీఖన్నా నటించింది. చిత్రంలో అందరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా ఈ సినిమా భేష్ అనిపించుకుంది.


Click it and Unblock the Notifications











