‘ఆచార్య’ నుంచి ఫ్యాన్స్‌కు శుభవార్త: అనుకున్న దాని కంటే ముందే చేసేసిన చిరంజీవి
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవిలో గతంలో ఎన్నడూ చూడనంత ఉత్సాహం కనిపిస్తోంది. దాదాపు నలభై ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నడూ లేనంత స్పీడుగా ఆయన సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన చిరు.. ప్రస్తుతం ఏక కాలంలో వరుస పెట్టి ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఇక, ఆయన ఇప్పుడు నటిస్తోన్న చిత్రాల్లో 'ఆచార్య' ఒకటి. టాలీవుడ్‌లోనే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే.
మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న 'ఆచార్య' మూవీ షూటింగ్ చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయింది. అయితే, ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇది కాస్తా చాలా రోజుల పాటు వాయిదా పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలైంది. అంతలో సెకెండ్ వేవ్ రావడంతో మళ్లీ చిత్రీకరణకు బ్రేక్ పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే బ్యాలన్స్ పార్ట్ కోసం చిత్రీకరణను పున: ప్రారంభించారు. ఆ వెంటనే దాన్ని కూడా కంప్లీట్ చేసేసి.. ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తైందని అధికారికంగా ప్రకటించారు. అయితే, కొన్ని పాటలు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయని తెలిపారు.

ఇక, ఇటీవలే 'ఆచార్య' పాటలకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయింది. ఆరంభంలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇలా కొద్ది రోజుల పాటు షూటింగ్ జరిగింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి అందుతోన్న సమాచారం ప్రకారం.. చిరంజీవి నేటితో 'ఆచార్య' టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకున్నారట. అంతేకాదు, ఆ వెంటనే ఆయన డబ్బింగ్‌ను కూడా ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే, రామ్ చరణ్ మాత్రం తన పార్ట్‌ను కొంత మేరకు చేయాల్సి ఉందని తెలుస్తోంది. అది కూడా అయిపోతే చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. 'ఆచార్య' మూవీని ఈ ఏడాది మేలో విడుదల చేయాలని అనుకున్నారు. ఇందుకోసం రిలీజ్ డేట్‌ను కూడా లాక్ చేసుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాకు సంబంధించిన కొత్త డేట్ గురించి చాలా రోజులుగా ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. కానీ, దీనిపై చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటి వరకూ స్పందించలేదు. దీంతో ఫలానా రోజు 'ఆచార్య' ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఎవరికి తోచిన విధంగా వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ఫలితంగా ఈ మూవీ పలుమార్లు హాట్ టాపిక్ అవుతోంది.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఆచార్య' కొరటాల శివ గత చిత్రాల మాదిరిగానే సందేశాత్మకంగా సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ చిత్రీకరిస్తున్నారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఓ మిషన్‌లో భాగంగా సిద్ధ పాత్ర చనిపోతే.. ఆచార్య దాన్ని కంప్లీట్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మెగా మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











