Bhola Shankar: ఫ్యాన్స్‌కు చిరంజీవి గుడ్ న్యూస్.. ఆ మాట చెప్పారంటే హిట్ గ్యారెంటీ!
కొంత కాలంగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. దీనికితోడు 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో ఆయనలో ఉత్సాహం రెట్టింపు అయింది. దీంతో ఇప్పుడు తన కొత్త చిత్రం 'భోళా శంకర్' మూవీని మరింత జోష్‌తో చేస్తున్నారు. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం.. తమిళంలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన 'వేదాళం'కు రీమేక్‌గా రూపొందుతోంది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

వాస్తవానికి చాలా రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' మూవీని స్టార్ట్ చేసేశారు. కానీ, మధ్యలో 'వాల్తేరు వీరయ్య' చేయడంతో ఈ సినిమా ఆలస్యం అయింది. ఇలా గత ఏడాది నుంచి ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను వీలు చిక్కినప్పుడల్లా చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవలే టాకీ పార్టు మొత్తాన్ని చిత్ర యూనిట్ కంప్లీట్ చేసుకుంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టేశారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఓ అదిరిపోయే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న 'భోళా శంకర్' మూవీకి సంబంధించిన డబ్బింగ్ వర్క్‌ను మెగాస్టార్ చిరంజీవి తాజాగా కంప్లీట్ చేశారు. ఈ మేరకు స్టూడియోలో ఉన్నప్పటి ఫొటోలను షేర్ చేసిన ఆయన 'భోళా శంకర్ డబ్బింగ్ పూర్తైంది. సినిమా తెరకెక్కిన తీరు చూసి చాలా సంతోషంగా అనిపించింది. ఇధి కచ్చితంగా ఫైర్ మాస్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. ఆగస్టు 11.. మీ క్యాలెండర్‌లో మార్క్ చేసుకోండి. సినిమాలో కలుద్దాం' అంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి వ్యాఖ్యలతో ఈ సినిమా హిట్టే అని పలువురు కామెంట్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. 'భోళా శంకర్' మూవీలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్ పాత్రను చేస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్ కీల పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్, సాంగ్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది.


Click it and Unblock the Notifications











