మా నవ్వును చెరిపేశాడు.. మళ్లీ రాని లోకాలకు.. భావోద్వేగానికి గురైన చిరంజీవి

Recommended Video

Chiranjeevi & Other Celebs About Venu Madhav

ప్రముఖ నటుడు, టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ బుధవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడిన వేణుమాధవ్.. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతితో యావత్ సినీ, రాజకీయ వర్గాలు కలత చెందాయి. సినీ ప్రముఖుల సందర్శనార్థం ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని ఫిలింఛాంబర్‌లో ఉంచారు.

పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రముఖులు.. ఘన నివాళి

పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రముఖులు.. ఘన నివాళి

ఫిలింఛాంబర్‌లో ఉంచిన వేణుమాధవ్ భౌతికకాయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున సినీ తారలు తరలి వస్తున్నారు. ఆయనతో కలిసి నటించిన నటీనటులంతా వేణుమాధవ్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. అభిమానులు, సినీ తారలతో ఫిలింఛాంబర్ ఆవరణ కిటకిటలాడుతోంది.

వేణుమాధవ్ ఇక లేడు అంటే నమ్మలేక పోతున్నాం

వేణుమాధవ్ ఇక లేడు అంటే నమ్మలేక పోతున్నాం

వేణు మాధవ్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన చిరంజీవి.. వేణు మాధవ్ తో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ బాధ పడ్డారు. ''మాస్టర్ సినిమా నుంచి మాతో కలిసి ఎన్నో సినిమాలు చేసిన వేణుమాధవ్ ఇక లేడు అనే నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నాము. చాలా చిన్నవాడు.. ఇంత చిన్న వయసులోనే ఆ భగవంతుడు అతనికి, మా సినీ పరిశ్రమకు ద్రోహం చేస్తాడని అనుకోలేదు'' అని అన్నారు చిరంజీవి.

అప్పుడే వేణు మాధవ్ టాలెంట్ ఏంటో తెలిసింది

అప్పుడే వేణు మాధవ్ టాలెంట్ ఏంటో తెలిసింది

వేణు మాధవ్ లేని లోటు సినిమా నవ్వుకే ఒక విషాదం. అతను మల్టీ టాలెంటెడ్. మాస్టర్ సినిమా సమయంలో ఉత్తేజ్, మేమంతా కలిసి షూటింగ్ సమయంలో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మాకు అప్పుడే వేణు మాధవ్ టాలెంట్ ఏంటో తెలిసింది. ఇలాంటి టాలెంటెడ్ వ్యక్తి టాలీవుడ్ లోకి రావడం చాలా ఆరోగ్యకరం అని అప్పుడే అనుకున్నామని చిరంజీవి చెప్పారు.

సినీ పరిశ్రమకే తీరని లోటు

సినీ పరిశ్రమకే తీరని లోటు

టాలీవుడ్ లో బ్రహ్మానందం, ఆలీ లాంటి కొద్దిమందే మాత్రమే హాస్యనటులున్న సమయంలో వేణు మాధవ్ లాంటి టాలెంటెడ్ కమెడియన్ ఇండస్ట్రీకి దొరకడం ఆనందంగా ఫీల్ అయ్యాం. కానీ అతి కొద్ది సంవత్సరాల్లోనే వేణు మాధవ్ ని పోఫోట్టుకోవడం సినీ పరిశ్రమకే తీరని లోటు, ముఖ్యంగా హాస్య కుటుంబానికే తీరని లోటు అని అన్నారు చిరంజీవి.

భగవంతుడు మా నవ్వును చెరిపేశాడు

భగవంతుడు మా నవ్వును చెరిపేశాడు

భగవంతుడు మా నవ్వును చెరిపేశాడని అనిపిస్తోందని చిరంజీవి అన్నారు. వేణు మాధవ్ పైన ఎక్కడున్నా సరే అతని ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఆ దేవుడు ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వాలని, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వేణు మాధవ్ గొప్ప నటుడు.. వెరీ సారీ అంటూ ముగించారు చిరంజీవి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X