తమ్ముడిలా, కొడుకులా చూసుకొన్నారు.. ఆయన లేకపోవడం దురదృష్టం.. చిరంజీవి ఉద్వేగం

Recommended Video

Mega Star Chiranjeevi Emotional Words On Vijaya Bapineedu's Demise

మహారాజు, మగమహారాజు, మగధీరుడు, గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు విజయ బాపినీడు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం మృతిచెందారు. ఆయన మృతితో తెలుగు సినీలోకం తీవ్ర విషాదానికి లోనైంది. పలువురు సినీ ప్రముఖులు విజయబాపినీడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేుకొన్నారు. తనకు అద్భుతమైన విజయాలను అందించిన విజయబాపినీడు మృతి వార్తతో మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చిరంజీవి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

ఈ రోజు నాకు దుర్దినం

ఈ రోజు నాకు దుర్దినం

విజయ బాపినీడు మరణం నాకెంతో దుర్దినం. విజయ బాపినీడు గారు మరణించారనేది నమ్మలేకుండా ఉంది. ఆయన నన్ను ఓ కొడుకులా, ఓ తమ్ముడిలా చూసుకునే వారు. ఆయనతో నా అనుబంధం కేవలం ఓ దర్శకుడు, నిర్మాతలా ఉండేది కాదు. నా మనసుకు అతి దగ్గరైన వ్యక్తి బాపినీడు గారు. వారితో నా పరిచయం 'పట్నం వచ్చిన పతివ్రతలు' సినిమా నుండీ. అప్పట్నించి ఆరు సినిమాలకు పైగా ఆయన నాతో చేయడం జరిగింది.

 కంఫర్ట్, సెంటిమెంట్ కుదరడం లేదు

కంఫర్ట్, సెంటిమెంట్ కుదరడం లేదు

'ఇతర హీరోలతో కూడా మీరు సినిమాలు చేయొచ్చు కదా' అని ఆయనతో అంటూ ఉండేవాడి. 'మీతో సినిమాలు తీయడం ప్రారంభించిన తర్వాత ఆ కంఫర్ట్ గానీ, సెంటిమెంట్ గానీ మరొకరితో నాకు కుదురడం లేదు. వేరే వారితో చేయలేకపోతున్నాను' అని చెబుతూ చాలా కాలం నా పట్ల ఆ అభిమానాన్ని, ప్రేమను చూపించిన గొప్ప వ్యక్తి.

విజయ బాపినీడు ఇంట్లోనే ఉండేవాడిని

విజయ బాపినీడు ఇంట్లోనే ఉండేవాడిని

తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు తరలివచ్చిన సమయంలో నేను హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన కొత్తలో ఎక్కడ ఉండాలి అని అనుకుంటున్న సమయంలో 'హైదరాబాద్ లో నా గెస్ట్ హౌస్ ఉంది. మీరు అందులో ఉండొచ్చు' అని చెప్పి.... పై ఫ్లోర్ లో ఉండే వారిని కింద కు పంపించి, పై రెండు ఫోర్లు నాకు ఇచ్చారు. చాలా కాలం అక్కడే ఉన్నాను.

తమ్ముడిలా, కొడుకులా వాత్సల్యం చూపేవారు

తమ్ముడిలా, కొడుకులా వాత్సల్యం చూపేవారు

ఎప్పుడూ నా పై తమ్ముడిలా, కొడుకులా వాత్సల్యం చూపించేవారు. ఆయనతో ఎన్నో స్వీట్ మెమొరీస్. ఒకరోజు 'మగమహారాజు' 100 రోజుల ఫంక్షన్ జరుగుతుంటే... ఓ ఏనుగును నాకు బహుమతిగా ఇచ్చారు. ఇదేమిటంటీ... దీనిని నేను ఏం చేసుకోనూ! అంటే... 'మీతో నాకు ఉన్న అనుబంధానికి, మీరు నా పట్ల చూపించే ప్రేమకు తగ్గట్టుగా ఏ బహుమతి ఇస్తే బాగుంటుందని ఆలోచించాను. ఏనుగును ఇస్తే దానికి మ్యాచ్ అవుతుందనిపించింది. అందుకే దీనిని ఇచ్చాను' అంటూ నా మీద ప్రేమను అలా చూపిన గొప్ప మనసున్న మనిషి ఆయన.

నాలుగు పట్టణాల్లో గ్యాంగ్ లీడర్ ఫంక్షన్

నాలుగు పట్టణాల్లో గ్యాంగ్ లీడర్ ఫంక్షన్

అలానే 'గ్యాంగ్ లీడర్' ఫంక్షన్ ను ఒకే రోజు నాలుగు పట్టణాల్లో గ్రాండ్ గా జరిపించిన అరుదైన రికార్డ్ మా ఇద్దరి కాంబినేషన్ లో ఉంది. ఆయన ఏం చేసినా... చాలా వినూత్నంగా, కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా నా అభిమానులకు ఆయన అంటే చాలా ఇష్టం. వారికి ఎంతో దగ్గరగా ఉండేవారు. దానికి కారణంగా 'చిరంజీవి' అనే మ్యాగజైన్ ను ఆయన పబ్లిషర్‌గా, ఎడిటర్ గా తీసుకొచ్చారు. అందులో నాకు సంబంధించిన ఫోటోలను, వార్తలను ప్రత్యేకంగా పొందుపరిచి అందించేవారు. బాపినీడు గారి మ్యాగజైన్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎదురుచూసేలా చక్కగా ప్రింట్ చేసేవారు. ఆ రకంగా కూడా నా మీద ప్రేమ చూపించారు.

బాధకరం, దురదృష్టకరం అని

బాధకరం, దురదృష్టకరం అని

అలాంటి విజయబాపినీడు లాంటి వ్యక్తిని ఇవాళ కోల్పోవడం అనేది చాలా బాధకరంగా ఉంది. చాలా దురదృష్టంగా భావిస్తున్నాను. బాపినీడు గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, నా సానుభూతిని తెలియచేస్తున్నాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X